ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ జరుపుతున్న సోదాల్లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ అనే ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించి .. వారి ద్గగర నుంచి సేకరించిన సమాచారంతో హైదరాబాద్‌లో మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ సారి ఓ పత్రికాఫీసు కూడా దర్యాప్తు సంస్థలకు టార్గెట్ అయింది. అది జనసేన పార్టీ నాయకుడు ముత్తా గోపాలకృష్ణకు చెందిన ఆంద్రప్రభ గ్రూప్.
అంధ్రప్రభ గ్రూప్‌లో అభిషేక్ బోయినపల్లి పెట్టుబడులు పెట్టారు. ఇది రహస్యంగా జరిగింది కాదు. నేరుగానే జరిగింది. ఈ అభిషేక్ బోయినపల్లి టీఆర్ఎస్ కీలక నేతలకు సన్నిహితుడు. ఆయనకు ఆయన పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని.. బ ినామీ పెట్టుబడులేనని అనుమానిస్తున్నారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రభ పత్రికను ప్రింట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ .. జాతీయ స్థాయిలో ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్నారు. దాని పేరు ఇండియా ఎహెడ్. ఓ ప్రణాళిక ప్రకారమే ఆ చానల్లో అభిషేక్ బోయినపల్లి పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది.
జనసేన పార్టీలో ముత్తా కుటుంబం ఉంది. జనసేన పార్టీకి మంచి కవరేజీ ఇస్తూంటారు. అయితే సమయంలో జగన్‌కు అనుకూలంగా రాస్తూంటారు కానీ..ఆంధ్రప్రభను పట్టిచుకునేవారు పెద్దగా లేరు. కానీ ఇంగ్లిష్ చానల్ విషయంలో కాస్త ఎక్కువ పెట్టుబడులు పెట్టడంతో ఆ చానల్ ఉనికి చాటుకుంటోంది. ఆ చానల్‌కు ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా జాతీయ మీడియాలో తమకు స్పేస్ ఉంటుందన్న ఆలోచనతో పెట్టుబడులు పెట్టారన్న ఉద్దేశంతో ఈడీ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.