పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో జనసేన పాతుకుపోతుందనే.. ఎన్నికలు నిర్వహించలేదని పవన్ కల్యాణ్ అన్నారు. పోరాటయాత్రలో బాగంగా… పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఆయన మాజీ సర్పంచ్ లతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరు పవన్‌కళ్యాణ్ జోస్యం చెప్పారు. రాజకీయవ్యవస్థ ముఖ్యమంత్రుల పిల్లలకు ఒక అలంకారం ..ఆ అలంకారాన్ని కొనసాగించాలని భావిస్తున్నారని విమర్శించారు. సీఎం పదవి వారసత్వమని జగన్ భావిస్తున్నారా? అని వైసీపీ అధినేతపైనా విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగడంలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే జగన్‌కు సంబంధించిన దోపిడీ వ్యవస్థ తీసుకురాబోమమన్నారు.
చింతమనేనిపై పవన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని వీధుల్లో గాలికి లేచే ఆకురౌడీ అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులను వెనకేసుకొస్తారనుకుంటే .. సీఎంకు సపోర్ట్ చేసే వాడిని కాదన్నారు. విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా.. లేదా.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా? అని పవన్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
మరో వైపు పవన్ కల్యాణ్ బస చేసిన ప్రాంతానికి తెలంగాణకు చెందిన కొంత మంది జనసేన కార్యకర్తలు వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుందామని పవన్ కల్యాణ్ వారికి సర్దిచెప్పారు. షెడ్యూల్ వచ్చినా పవన్ పోటీ చేయాలా వద్దా అనే ఆలోచిస్తున్నారు. కానీ.. పంచాయతీ ఎన్నికల విషయంలో మాత్రం బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు జరిపి ఉంటే దున్ని పడేసేవాళ్లమన్నారు.