ఆర్.ఆర్.ఆర్ నుంచి మరో పాట వచ్చింది. అదే జననీ. నిజానికి రేపు ఈ పాట విడుదల అవుతోంది. కానీ… తెలుగు మీడియా కోసం మాత్రం.. ఒక రోజు ముందే ఈ పాటని వినిపించాడు రాజమౌళి. ఆర్కే కాంప్లెక్స్‌లో జరిగిన ప్రెస్ మీట్లో ఈ పాటని మీడియా కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. నిజానికి ఇది పాట కాదని, ఓ ఎమోషనల్ డ్రైవ్ అని.. రాజమౌళి పేర్కొన్నాడు. ఆర్.ఆర్.ఆర్‌లోని ఎమోషన్‌నీ మణిహారం అయితే.. ఆ మణిపూసల్ని పట్టి ఉంచే దారంలాంటిది ఈ జననీ పాట అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. తన సినిమాల్లో ఆర్.ఆర్ చాలా కీలకం. సన్నివేశాల్ని ఎలివేట్ చేయడానికి ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయిస్తాడు రాజమౌళి. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రూపంలో వినిపించే పాట ఇది.
”సినిమాలో రీ రికార్డింగ్ ప్రోసెస్ నేను చాలా ఎంజాయ్ చేసే మూమెంట్. అదో డిస్కవరీ లాంటిది. నేను చేసిన దాంట్లోనే తెలియని కొత్త కోణాలున్నాయా అనేలా పెద్దన్న రీ రికార్డింగ్ చేస్తాడు. 2 నెలలు రీ రికార్డింగ్ చేశాక… `ఇంకా ఏదో కావాలి.. దాన్ని పట్టుకోవాలి` అంటుండేవాడు. జననీ అనేది ఈ సినిమాకి కోర్ మెలోడీ. ఓ రోజు ఈ పాట పట్టుకుని వచ్చాడు. లిరిక్స్ కూడా తనే రాశాడు. ఆర్.ఆర్.ఆర్‌లో చాలా ఎమోషన్లు ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్స్ ఉంటాయి. వాటన్నింటిలోనూ కోర్ గా వినిపించి,కనిపించే పాట ఇది” అని జననీ గురించి చెప్పుకొచ్చాడు రాజమౌళి.