సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన డీపీ ని ఆయన అభిమానులు ట్విట్టర్లో వైరల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియా ట్వీట్లు, పోస్ట్ లలోనే కాకుండా, సామాజిక కార్యక్రమాల్లో కూడా జనసైనికులు చురుగ్గా ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా, సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున పెద్ద ఎత్తున వేడుకలు చేయడం లేదు. అయితే వేడుకల్లో పాలుపంచుకోలేక పోతున్నప్పటికీ, తమ అభిమాన నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని జనసైనికులు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు విరాళంగా ఇస్తున్నారు.
ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో, జిల్లా ఆసుపత్రులకి 320 ఆక్సిజన్ సిలిలెండర్లు విరాళంగా ఇవ్వనున్ననారు జనసేన నాయకులు, కార్యకర్తలు. కరోనా నేపద్యంలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నట్లు వార్తలు వస్తుండడంతో, జనసైనికులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏ జిల్లాలో ఏ ఆస్పత్రులకు ఎన్నిి ఆక్సిజన్ సిలిండర్లు విరాళంగా అందజేస్తున్నారో, ఆ వివరాలను జనసేన పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్ లోో పొందుపరుస్తున్నారు.
విజయనగరం జిల్లా:
వేడుకలకు దూరంగా, కరోనా బాధితులకు అండగా…
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులను కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న జనసేన శ్రేణులు.#JanaSeva pic.twitter.com/LsNwMk8VKY— JanaSena Party (@JanaSenaParty) August 27, 2020
ఈ విషయంలో జనసైనికుల ఉదారతను ఇతర పార్టీలకు చెందిన అభిమానులు కూడా సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.