సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాజకీయ పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల్లో జనసైనికులు ఎక్కువగానే ఉంటారు. ఏదైనా ట్రెండ్ చేయాలంటే వారి తర్వాతే ఎవరైనా . అందుకే పవన్ ను ట్విట్టర్లోనే సీఎం చేస్తారని సెటైర్లు కూడా వారిపై పడుతూ ఉంటాయి. అయితే వీరి యాక్టివ్ నెస్‌ను ఆసరా చేసుకుని కొంది మంది ఫెలో జనసైనికులు మోసాలకు పాల్పడుతున్నారు.
మెగా అభిమానిగా హ్యాండిల్ క్రియేట్ చేసుకుని తాను సీఏనని.. చెప్పి చాలా మందితో పరిచయాలు పెంచుకున్న ఓ మోసగాడు.. తల్లి సెంటిమెంట్ కురిపించి.. తన అమ్మ చనిపోయిందని చెప్పి.. చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇలా మొత్తంగా రూ. కోటి వరకూ వసూలు చేసినట్లుగా తేలింది. తర్వాత ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో వారంతా ఈ విషయాన్ని ఒకరికొకరు బయట పెట్టుకోవడంతో విషయం వెలుగు చూసింది. ఇప్పుడా మెగా అభిమాని కనిపించకుండా పోయారు. మోసపోయిన జనసేన ఫ్యాన్స్ అంతా లబోదిబోమంటున్నారు.
సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో ఎవరి ఐడెంటీటీ తెలియకుండానే ఇలా … మోసాలకు పాల్పడుతున్నారు. రాజకీయ పార్టీల గురించి ఎక్కువగా చర్చలు పెట్టుకోవడం.. ఆయా రాజకీయ పార్టీల సానుభూతి పరులను ఆకట్టుకోవడం.. తర్వాత డబ్బులు వసూలు చేసి మాయమవడం కామన్ గా జరుగుతోంది. జనసైనికులకే ఎక్కువగా ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి.
గతంలో ఇలా ఓ జనసైనికుని వైద్యం కోసం అంటూ…. ఓ జనసేన అభిమాని లక్షలు సేకరించాడు కానీ బాధితుడు ఇవ్వలేదని గగ్గోలు రేగింది. ఇలాంటివి జనసేన సోషల్ మీడియా టీంకు చికాకు తెప్పిస్తున్నాయి.