పవన్ కల్యాణ్‌పై సినిమా తీస్తానని, దానికి ‘తాళి – ఎగతాళి’, ‘నిత్య పెళ్లికొడుకు’ లాంటి టైటిళ్లు పరిశీలిస్తున్నామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించిన 24 గంటల ముందే… రాంబాబుపై జనసైనికుల ర్యాగింగ్ మొదలైపోయింది. త్రిపుల్ ఆర్ టైపులో ‘ఎస్.ఎస్.ఎస్’ పేరుతో ఓ సినిమానే మొదలెట్టేశారు. ఎస్.ఎస్.ఎస్ అంటే సందులో సంబరాల రాంబాబు అన్నమాట. సుకన్య క్యారెక్టర్ కోసం ఓ హీరోయిన్ని రెడ్ లైట్ ఏరియాలో వెదుకుతున్నామని, కానీ దొరకడం లేదని, ఎంత ఖర్చైనా బ్యాంకాక్ నుంచైనా తీసుకొస్తామని రాంబాబుపై సెటైర్లు వేశారు. ఈ సినిమా తీస్తారా, లేదా అనేది పక్కన పెడితే, రాంబాబుపై జన సైనికుల దూడుకు మాత్రం జనాల్ని ఆకర్షిస్తోంది. నీటి పారుదల శాఖా మంత్రి అయి ఉండి పోలవరం గురించి ప్రాజెక్టుల గురించీ మాట్లాడడం చేత కాక, సినిమాల గురించీ, వాటి కలక్షన్ల గురించీ మాట్లాడుతున్న అంబటి రాంబాబు ఇప్పటికే ట్రోలర్స్‌కి కావల్సినంత మసాలా అందిస్తున్నాడు. ఇప్పుడు జన సైనికుల ర్యాగింగ్ తో అది ఇంకాస్త ఎక్కువైంది. తనకు ఎవరి మీద కోపం ఉన్నా, వాళ్లపై సినిమా తీయడం రాంగోపాల్ వర్మకు అలవాటు. పరిస్థితి చూస్తుంటే… వర్మలు చాలామంది తయారవుతున్నట్టే అనిపిస్తోంది. పొలిటికల్ సైటర్లు తీయాలంటే రాంగోపాల్ వర్మ తరవాతే ఎవరైనా. ఇక ముందు ఆ మాట చెల్లుబాటు కాదేమో…? ప్రతీ ఒక్కరూ తమ అక్కసుని సినిమాల రూపంలో తీర్చుకోవాలని చూస్తే… రాను రాను ప్రెస్ మీట్ల స్థానంలో సినిమాలు వచ్చి కూర్చుంటాయేమో..?