సంకీర్ణ ప్రభుత్వం ఎంత పర్ ఫెక్ట్ గా ఉందో చెప్పేందుకు వంద రోజుల పాలనపై కూటమి పార్టీలు కలసి కట్టుగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశం తేల్చి చెప్పింది. పాలనలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నా తాము వాటిని ఎలా అధిగమించగలిగామో వివరించారు. పరస్పర సహకారంతో వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు… కూటమి పార్టీల మధ్య మరింత సమన్వయాన్ని పెంచాయని అర్థం చేసుకోవచ్చు.
ఒకరిని ఒకరు అభినందించుకోవడం కలసి కట్టుగా ఆడే ఆటలో మొదటి సక్సెస్ సీక్రెట్
ప్రపంచంలో ఏ ఒక్క విజయం ఇండివిడ్యువల్ గా రాలేదు. ప్రతీది టీమ్ తోనే సాధ్యమవుతుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా… మా టీమ్ అంటూంటారు. ఇది రాజకీయాలకూ వర్తిస్తుంది. ఏపీలో కూటమి పార్టీల టీమ్ రాజకీయం చేస్తుంది. ఇలా అందరూ కలిసి పని చేస్తున్నప్పుడు.. ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకు సాగడం.. టీమ్ స్పిరిట్ లోని ముఖ్య లక్షణం. కూటమి పార్టీలు అదే చేస్తున్నాయి. ఎన్డీఏ సమావేశంలో ఒకరినొకరు పొగుడుకున్నారని అనుకుంటున్నారు. కానీ వారి టీమ్ స్పిరిట్ ను గుర్తిస్తే… ఆ బాండింగ్ రాజకీయాల్లో ఎంత సంచలనం సృష్టించబోతోందో అర్థం చేసుకోవచ్చు.
తప్పొప్పులపై అంతర్గతంగా చర్చలు – నిర్ణయాలు
కూటమి పార్టీలు.. ప్రజాసేవ విషయంలో… వారు తమపై పెట్టుకున్న నమ్మకం విషయంలో రాజీపడటం లేదు. లోపాలు ఏమైనా జరిగితే వెంటనే తెలుసుకుని తెలియచెప్పి దుద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానిపై విపక్ష నేతలు ఎన్నిప్రచారాలు చేసినా డోంట్ కేర్. వరద సాయం విషయంలో నాదెండ్ల మనోహర్ కు చంద్రబాబు చేసిన కొన్ని సూచనలకు చిలువలు .. పలువలు చేసి ప్రచారం చేసినా వైసీపీ మీడియాకు ఆయాసమే మిగిలింది కానీ.. కూటమి పార్టీల మధ్య చిన్న గీత కూడా గీయలేకపోయారు. పాలన విషయంలో… అంతర్గతంగా తప్పొప్పులు చర్చించుకుని దిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
పవన్ రియల్ గేమ్ ఛేంజర్
పవన్ కల్యాణ్ కూటమి రాజకీయం ఇంత పర్ ఫెక్ట్ గా చేస్తారని ఎవరూ అనుకోలేదు. చంద్రబాబు పనితీరుకు ప్రత్యామ్నాయం లేదని ఆయన మరోసారి మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇలాంటి బాండింగ్ తో.. జగన్ రెడ్డిలాంటి వారికి మరోసారి చిన్న అవకాశం కూడా దక్కనిచ్చేందుకు వారు ఏ మాత్రం సిద్ధంగా లేరని అర్థం చేసుకోవచ్చు. ఎలా చూసినా కూటమి సమావేశంలో పార్టీల బాండింగ్.. వైసీపీకి నిద్రపట్టనివ్వదని అనుకోవచ్చు