ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో పోటీ చేశారు. జనసేన చాలా చోట్ల ఖాతా తెరిచింది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న అమలాపురం, నర్సాపురం లాంటి చోట్ల.. నాలుగైదు స్థానాలు గెల్చుకుని తన బలాన్ని చాటింది. కార్పొరేషన్లలోనూ ఖాతా తెరిచింది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రమే.. ఎక్కడా ఉనికి చాటలేకపోయింది. విశాఖ పట్నం కార్పొరేషన్లో జనసేన మద్దతుతో అతి కష్టం మీద ఒక డివిజన్ను బీజేపీ గెలుచుకోలిగింది. ఇంకెక్కడా ప్రభావం చూపించిన పాపాన పోలేదు. భారతీయ జనతా పార్టీకి క్యాడర్ లేకపోవడం ఓ కారణం అయితే.. పూర్తిగా జనసేన మీద ఆధారపడి.. వాటి ఓట్లను పొంది గెలుపొందుతాదమని ప్రయత్నమే చేసింది.
అయితే.. జనసేన క్యాడర్ మాత్రం.. బీజేపీని నమ్మలేదు. ఆ విషయం ఓటింగ్లో తేలిపోయింది. భారతీయ జనతా పార్టీ తమపై స్వారీ చేస్తోందని నమ్మిన జనసేన నేతలు… బీజేపీ బరిలో ఉన్న చోట… ప్రత్యామ్నాయ పార్టీలకే ఓటు వేశారు. విశాఖలో మూడు చోట్ల జనసేన గెలిచింది. బీజేపీ పోటీ చేసి న చోట… ఓ మాదిరి ఓట్లు కూడా రాకపోవడమే దీనికి నిదర్శనం. బీజేపీకి ఓటు బ్యాంక్ ఉంటే.. జనసేనకు బదిలీ అయి ఉండేది. అలాంటిదేమీ లేకపోడంతో… జనసేనకు ఇబ్బందికరంగా మారింది. బీజేపీని తమ భుజంపై మోసుకుని సీట్లు గెలిపించాల్సిన పరిస్థితి వస్తోందని జనసేన క్యాడర్ నిరాశలో కూరుకుపోతోంది.
ఏపీ బీజేపీ నేతలు.. వైసీపీకి మద్దతుగా ఉంటూండటం.. వ ైసీపీ నేతలు జనసేనను దారుణంగా ట్రీట్ చేస్తూండటంతో పరిస్థితి మారిపోయింది. ఏపీలో బీజేపీతో పొత్తు విషయంపైనా పవన్ కల్యాణ్ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితిని.. ఈ ఎన్నికలు సూచిస్తున్నాయని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఈ అంశంపై సీరియస్గా ఆలోచించాలని పార్టీ క్యాడర్ నుంచి జనసేన నాయకత్వానికి ఫీడ్ బ్యాక్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.