జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ వ్యూహాత్మక ట్వీట్ చేశారు. అభిమానలకు జాగ్రత్తలు చెబుతూ.. జన భద్రం అని టైటిల్ పెట్టి మరీ ఈ ట్వీట్ చేశారు. ” అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి. ” అని ట్వీట్లో పవన్ తెలిపారు.
పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇప్పటి వరకూ తిట్టిన వారు ఇప్పుడు ఎందుకు పొగుడుతారన్న ప్రశ్న ప్రధానంగా వస్తుంది. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విపరీతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసినా.. వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కువగా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. అనేక సార్లు ఈ విమర్శలు వివాదాస్పదం అయ్యాయి. పవన్ కల్యాణ్‌ను పొగిడితే ఆయన అభిమానులు… ఆ పొగిడిన వారికి మద్దతుగా మాట్లాడతారు. ఇలా వైఎస్ఆర్సీపీ నేతలు పవన్‌ను పొగిడితే..అభిమానులు కూడా ఆ నేతల్ని పొగుడుతారు.
దీని వల్ల సీన్ మారిపోతుందని.. రెండు పార్టీలు మిత్రపక్షాలన్న అభిప్రాయం కలుగుతుందని.. అది జనసేనను మరింత ఇబ్బంది పెడుతుందన్న అభిప్రాయం ఉంది. వైఎస్ఆర్సీపీ కొత్త స్ట్రాటజిస్ట్‌ను నియమించుకుంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు ఆ వైపు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందేమో కానీ.. అనుకున్నట్లుగా.. ఇప్పటి వరకూ తిట్టిన వారు ఎవరైనా అభినందిస్తే మాత్రం పవన్ కల్యాణ్‌కు ఖచ్చితమైన సోర్స్ ఉందనే అనుకోవాలి. అయితే పవన్ కల్యాణ్ ఈ ప్లాన్ బయట పెట్టారు కాబట్టి.. పొగడటం ఆపేస్తారేమో చడాలి.
జర బద్రం
—————
అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)— Pawan Kalyan (@PawanKalyan) June 8, 2022