విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని లైట్ తీసుకుని ఢిల్లీలో కూర్చుని రాజకీయ విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీలకు షాక్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. వారు పార్లమెంట్లో కేంద్రంపై పోరాడేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా డిజిటల్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. 18, 19, 20 తేదీల్లో ప్రజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి.. వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఇరవై రెండు మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రశ్నిస్తున్నారు. అన్యాయం జరుగుతున్నా నోరు మెదపని ఎంపీలు ఎందుకని ఘాటుగానే విమర్శిస్తున్నారు. అయితే పార్లమెంట్లో మాత్రం ఏపీకి చెందిన ఎంపీలు అరకొరగానే స్పందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని అసలు ఎవరూ పోరాటం చేయడం లేదు. కనీసం ప్లకార్డులు కూడా ప్రదర్శించడం లేదు.టీడీపీ ఎంపీలు ముగ్గురు ఉన్నారు. వారు కూడా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సభను స్తంభింపచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో వారిపై ఒత్తిడి తేవడం ఒక్కటే మార్గమని జనసేన అధినేత నిర్ణయించుకున్నారు. పా
జనసేన పార్టీ గతంలో రోడ్లను బాగు చేయాలన్న డిమాండ్‌తో ఇలాగే డిజిటల్ ఉద్యమం నిర్వహించింది. ఏపీ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, గుంతలు తేలిన రోడ్లను జనసేన కార్యకర్తలు ట్వీట్ చేసి.. వాటిని ట్రెండింగ్‌లోకి తీసుకు వచ్చారు. తర్వాత శ్రమదాన కార్యక్రమం కూడా చేపట్టారు. ఆ తరహాలోనే ఇప్పుడు ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.