పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 2019 ఎన్నికలలో ఎలా పర్ఫార్మ్ చేసింది అన్న అంశంపై అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజలలోను చర్చ జరుగుతోంది. మొదటి నుండి జనసేన కు ఏ మాత్రం మద్దతు ఇవ్వని మీడియా చానల్స్ లో మాత్రం, ఎన్నికలవగానే, జనసేన కి ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా ఉండ బోవడం లేదంటూ విశ్లేషణలు మొదలయ్యాయి.
పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మొరాయింపు కేవలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలహీనంగా ఉన్న చోట మాత్రమే జరగడంతో, ప్రజలలో, అలాగే జనసేన అభిమానులలో, పలు అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక లాంటి నియోజకవర్గాల్లో సైతం రిగ్గింగ్ జరిగిందని వస్తున్న రిపోర్ట్ లు, ఎన్నికల రోజున రిగ్గింగ్ ఆపడానికి ప్రయత్నించినందువల్లే ఆ జనసేన అభిమాని తల పగిలేలా కొట్టారు అన్న వార్తలు జనసేన అభిమానులని కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక్కోవడానికి పలువురు జనసేన ఆఫీసులని కూడా సంప్రదిస్తున్నారు. ఇప్పటిదాకా తెలుస్తున్న సమాచారం బట్టి, జనసేన ఫలితాలు ఈ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
భీమవరం, గాజువాక- రెండు చోట్ల గెలవనున్న పవన్ కళ్యాణ్?
మొదటి గా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాల గురించి చూస్తే, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ను బట్టి చూస్తే రెండు నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలవ బోతున్నారు అని సమాచారం. మొదట్లో భీమవరంలో ఓడిపోయే అవకాశం ఉందని వార్తలు రావడంతో, జనసేన అభిమానులు స్వచ్ఛందంగా భీమవరం వెళ్లి పార్టీ తరఫున విపరీతంగా ప్రచారం చేయడం కలిసి వచ్చిందని భావిస్తున్నారు. అయితే గాజువాక విషయంలో మొదట్లో అనుకున్నట్లు రికార్డు మెజారిటీ వచ్చే అవకాశం లేదని మాత్రం తాజాగా వచ్చిన సమాచారం బట్టి తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగిరెడ్డి, రికార్డు స్థాయిలో ఖర్చు పెట్టడం తో పాటు, కొన్ని ఎన్నుకోబడ్డ పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగిందని వస్తున్న సమాచారం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. గాజువాక లో ఓటింగ్ యంత్రాలు మొరాయించి, అర్ధరాత్రి వరకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
జనసేన కు ఎన్ని ఓట్లు రానున్నాయి ?
ఇక మొత్తంగా జనసేన పార్టీకి పడ్డ ఓట్ల సంగతి చూస్తే, గతంలో ప్రజారాజ్యం పార్టీకి సుమారు 49 లక్షల ఓట్లు ఈ 175 నియోజకవర్గాల్లో పడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ 175 నియోజకవర్గాల్లో, బి ఎస్ పి కమ్యూనిస్టులకు కేటాయించిన 35 స్థానాలలోనూ, అది కాకుండా రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల బలహీన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలలోను, జనసేన అభ్యర్థులు జనసేనకు ఓటు వేయడం కంటే, వైఎస్సార్సీపీని నిలవరించడం కోసం ఓటు వేసినట్లు గా సమాచారం అందుతోంది. ఈ లెక్కన జనసేన పార్టీకి, రాష్ట్రవ్యాప్తంగా కలిపి 20% ఓట్లు సాధించే పొటెన్షియల్ ఉన్నప్పటికీ, కేవలం 100 నియోజకవర్గాల్లో మాత్రమే ( బి ఎస్ పి కమ్యూనిస్టులకు కేటాయించిన స్థానాలు, మరియు రాయలసీమలో బలహీనమైన అభ్యర్థులు ఉన్న స్థానాలు మినహాయించగా మిగిలిన స్థానాలు) జనసేన ఓట్లు కన్సాలిడేట్ కావడంతో, 20% పొటెన్షియల్ లో 13-15 % మాత్రమే ఓటు సాధించే అవకాశం కనిపిస్తోంది. దీంతో మొత్తంగా ఉన్న మూడు కోట్ల పైచిలుకు ఓట్ల లో సుమారు 45 లక్షల ఓట్ల దాకా జనసేన కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ యువత లో ఉన్న సైలెంట్ ఓటింగ్ పూర్తిగా జనసేన వైపు మళ్లితే 50 లక్షల దాకా చేరే అవకాశం కనిపిస్తోంది.
ఎన్ని ఎంపీ స్థానాలు రావచ్చు ?
ఇప్పటిదాకా అందుతున్న సమాచారాన్ని బట్టి, విశాఖపట్నంలో లక్ష్మీనారాయణ, నరసాపురం లో నాగబాబు కి గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీరితోపాటు అమలాపురం ఎంపీ స్థానం లో కూడా జనసేనకు అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఈ మూడు స్థానాలు కాకుండా, కాకినాడ , మచిలీపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, నంద్యాల స్థానాలలో గట్టి పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో, యువత ఎమ్మెల్యే, ఎంపీ – రెండు స్థానాలకు జనసేనకి ఓటు వేసినప్పటికీ, అదే కాపు సామాజిక వర్గం లో 45 ఏళ్ల పైబడిన వారు మాత్రం, చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యే స్థానానికి అభ్యర్థులను బట్టి ఇతర పార్టీలకు ఓటు వేసి, ఎంపీ స్థానానికి మాత్రం జనసేనకు ఓటు వేసినట్లు సమాచారం అందుతోంది. మరి ఇది ఎంత వరకు జనసేనకు స్థానాల విషయంలో లాభం చేకూరుస్తుందో ఫలితాలను బట్టి తెలుస్తుంది.
ఎమ్మెల్యే స్థానాల ఫలితాలు మాటేమిటి:
ఎమ్మెల్యే స్థానాల విషయంలో ప్రత్యర్థి పార్టీలు జనసేనకు ఐదు- ఆరు సీట్లకు మించి రావు అంటూ ప్రచారం చేస్తున్నాయి. జనసేన అభిమానులు మాత్రం ఈ క్రింద పేర్కొన్న 40 స్థానాలలో జనసేన చాలా గట్టి పోటీ ఇచ్చింది అని, వీటిలో ఎన్ని గెలుస్తారు అన్నది ఈ త్రిముఖ పోటీలో రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుందని, అయితే ప్రత్యర్థి పార్టీలు చెప్పినట్లుగా ఫలితాలు ఉండవని, ప్రజారాజ్యం పార్టీ కంటే మెరుగ్గా, జనసేన కనీసం 20 స్థానాలలో సీట్లు సాధిస్తుందని అంటున్నారు. వై ఎస్ ఆర్ సి పి అభిమానులు తమకు వంద సీట్లు వస్తాయని అంటుంటే, తెలుగుదేశం పార్టీ అభిమానులు తాము మ్యాజిక్ ఫిగర్ దాటుతామని అంటుంటే, జనసేన అభిమానులు మాత్రం తెలుగుదేశం పార్టీ 70 స్థానాల వరకు గెలిస్తే గనక హాంగ్ ఏర్పడే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జనసేన గట్టి పోటీ ఇచ్చే 40 స్థానాలు ఇవే. వీటిలో భీమవరం ,గాజువాక, నరసాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి గన్నవరం, తాడేపల్లిగూడెం , అమలాపురం వంటి చాలా స్థానాలలో గెలుపు మీద జనసేన అభిమానులు గట్టి ధీమాతో ఉన్నారు.
1.గాజువాక.
2.పెందుర్తి.
3.ఎలమంచిలి.
4.పిఠాపురం.
5.కాకినాడ రూరల్.
6.పెద్దాపురం.
7.పి గన్నవరం.
8.రాజోలు.
9.రాజమండ్రి రూరల్.
10.భీమవరం.
11.తాడేపల్లిగూడెం.
12.నిడదవోలు.
13.నరసాపురం.
14.పెడన.
15.విజయవాడ వెస్ట్.
16.గుంటూరు వెస్ట్.
17.తెనాలి.
18.తిరుపతి.
19.ముమ్ముడువరం.
20.కొత్త పేట.
21.అమలాపురం
22. నంద్యాల
23. పాడేరు
24. రామచంద్రాపురం
25. విశాఖపట్నం నార్త్
26. అనకాపల్లి
27. పాలకొల్లు
28. ఏలూరు
29. కైకలూరు
30. మాడుగుల
31. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు
32. తుని
33. కాకినాడ సిటీ
34. అవనిగడ్డ
35. గురజాల
36. పుంగనూరు
37. తణుకు
38. కావలి
39. మచిలీపట్నం
40. నెల్లిమర్ల
ఏది ఏమైనా నా ఈ 40 స్థానాలలో ఎన్ని స్థానాలు సాధించినా కూడా, అవి ఒక రూపాయి డబ్బు పంచి పెట్టకుండా, ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లను గురి చేయకుండా, గెలిచిన స్థానాలు అని గుర్తు పెట్టుకోవాలని జనసేన అభిమానులు అంటున్నారు. మరి తుది ఫలితాలకోసం అనే మే 23వ తేదీ దాకా వేచి చూడాలి.