దేవాలయాలపై దాడుల అంశంలో విచారణను.. తెలంగాణ పోలీసులకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం పోయిందని జనసేన నేత పోతిన మహేష్ చెబుతున్నారు. వందకుపైగా ఘటనలు జరిగినా ఒక్కరంటే.. ఒక్క నిందితుడ్ని పట్టుకోవడం దారుణ వైఫల్యమని.. అందుకే… తెలంగాణ పోలీసులకు విచారణ బాధ్యతలివ్వాలని ఆయన కోరుతున్నారు. హిందూఆలయాలపై దాడుల విషయంలో పోలీసులు రంపం దొరికింది.. ఒకటే వాడారు.. కుట్ర ఉంది.. లాంటి వివరాల్ని రోజూ మీడియాకు చెబుతున్నారు. అదుపులో ఇరవై మంది.. ముఫ్పై మంది అని లీకుస్తున్నారు. అసలు ఎవరు చేశారు..? ఎందుకు చేశారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
పోలీసులు కూడా తేల్చలేకపోతున్నారు. అదే సమయంలో… ఈ విగ్రహాల ధ్వంసంపై విచారణ జరుపుతున్న వారందరూ క్రిస్టియన్లేనని విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. సీఎం జగన్ నుంచి రామతీర్ధం ఘటనపై విచారణకు నియమించిన సునీల్ కుమార్ వరకూ అందరూ క్రైస్తవలే. అందరూ మత ప్రచతారంలో పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో.. తమకు నమ్మకం లేదన్న ప్రకటనలు విపక్షాల నుంచి వస్తున్నాయి. సీబీఐకి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది… జనసేన మాత్రం సెటైరికల్‌గా తెలంగాణ పోలీసులకు ఇవ్వాలని కోరుతోంది.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అదే పనిగా.. పోలీసులపై విమర్శలు చేసేవారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలంగాణ పోలీసులకు వైసీపీ నేతలు చేసేవారు. వారు అక్కడ కేసులు నమోదు చేసి.. ఏపీలో నిందితుల్ని పట్టుకునేవారు. అయితే ఇప్పుడు.. వైసీపీనే అధికారంలోకి వచ్చింది. పోలీసుల పనితీరుపై విపక్షం విమర్శలు చేస్తోంది. అప్పట్లో నమ్మకం లేదన్న వైసీపీ .. ఇప్పుడు పోలీసులు దేశంలోనే అత్యంత సమర్థులని చెబుతోంది.