చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు లో రకరకాల అవకతవకలు జరిగాయంటూ ఎప్పటినుండో ఇతర రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. అయితే, దీనిమీద ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అయితే అనూహ్యంగా జనసేన నేత పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టు, దీనికి సంబంధించి విచారణ జరిపించాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బంతి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కోర్టులోకి వెళ్లినట్లయింది. ఇందుకు సంబంధించిన వివరాలు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేశారు.
విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేస్తూ, “ప్రాజెక్టు అంచనాలు పెంచారని,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో అవకతవకలు జరిగాయని పుల్లారావు ఫిర్యాదు కోర్టులో పిర్యాదు . ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు. పప్పులు,నిప్పులు తమ నిజాయితీని నిరూపించుకో వలసిన సమయం ఆసన్నమైంది. పోలవరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టులో జనసేన నేత పెంటపాటి పుల్లారావు పిటిషన్. పిటిషన్ను ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం.” అని రాసుకొచ్చారు.
మరి ఈ కేసు ఎన్ని మలుపులు తీసుకుంటుందన్నది ఇప్పటి కిప్పుడే ఊహించలేము. అయితే, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి బి-టీం గా కొనసాగుతోంది అంటూ ఇతర రాజకీయ పార్టీల విమర్శలకు మాత్రం ఈ పరిణామం చెక్ పెట్టే అవకాశం ఉంది.