జనసేన పార్టీలో ముఖ్య నేతలు ఎవరు అంటే… ముందుగా పవన్ కల్యాణ్.. తర్వాత నాదెండ్ల మనోహర్ పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత మరో నేత ఎవరూ అంటే.. చెప్పలేని పరిస్థితి. ఇక.. క్యాడర్‌ను కనిపెట్టుకుని రోజువారీగా పని చేసుకునేవారి సంఖ్య చాలా తక్కువ. కానీ.. ఒక్కరు మాత్రం.. రోజూ.. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు. తన నియోజకవర్గంలో మంత్రి ఉన్నా… ఆయనపై రాజకీయ విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు. మంత్రి చేస్తున్న స్కామ్ అంటూ రోజుకో ఆరోపణ చేస్తూ ఉంటారు. జనసేనలో సిన్సియర్‌గా రాజకీయం చేసుకుంటున్న ఆ నేత పోతిన మహేష్.
విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై వ్యవహారశైలిపై చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన వ్యాపారుల దగ్గర చందాలు వసూలు చేయడం దగ్గర్నుంచి దేవాదాయ మంత్రిగా తన అధికారాన్ని ఉపయోగించుకుని వివిధ ఆలయాల భూముల్ని కాజేసే ప్రయత్నాలు చేయడం వరకూ చాలా చేస్తున్నారని పోతిన మహేష్ బయట పెడుతున్నారు. అమ్మవారి రథంలో మాయమైన మూడు సింహాలు.. వెల్లంపల్లి ఇంట్లోనే ఉంటాయని చెబుతున్నారు. తాజాగా.. బెజవాడలో ఓ ఆలయానికి సంబంధించిన 300 కోట్ల భూముల్ని నొక్కేయడానికి ప్రణాళికలు వేశారని.. దానికి సంబంధించిన తీసుకున్న కొన్ని నిర్ణయాలను పోతిన మహేష్ బయట పెట్టారు. మంత్రి అవినీతితో సంపాదించిన ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లు దాటిపోయిందని ఆయన అంటున్నారు. లు దండుపాళ్యం గ్యాంగ్ లాగా మారారని,
మంత్రితోనే తలపడుతున్న పోతిన మహేష్‌కు ఏ స్థాయి వేధింపులు వస్తాయో అంచనా వేయడం కష్టమేం కాదు. కానీ.. ఆ వేధింపులను రాజకీయ హెచ్చరికల్ని లెక్క చేయడం లేదు. వెల్లంపల్లిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వెల్లంపల్లికి ఇప్పుడు పోతినమహేష్ కంట్లో నలుసులా తయారయ్యారు. పోతిన మహేష్‌లా.. జనసేన నేతలు అన్ని చోట్లా రాజకీయం చేస్తే.. తిరుగు ఉండదన్న చర్చ కూడా ఆ పార్టీలో నడుస్తోంది.