జనసేన అధినేత మళ్లీ సభలతో పర్యటనలతో యాక్టివ్ కానున్నారు. పవన్ కళ్యాణ్ రేపు పాడేరు లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మన్యం ప్రాంతానికి చెందిన సమస్యలపై ఈ సభలో మాట్లాడడనున్నట్టు తెలుస్తోంది.
పాడేరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న పసుపులేటి బాలరాజు ఇప్పటికే జనసేన పార్టీలో చేరి ఉన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో , కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేసిన బాలరాజుకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. పైగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం మీద గిరిజన ఓటర్లను ప్రభావితం చేయగల నేతగా పేరుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో జన సేన నిర్వహించనున్న బహిరంగ సభ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
అలాగే, ప్రస్తుతానికి ఉత్తర ఆంధ్ర జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సభ అనంతరం వామపక్షాలకు పొత్తుల విషయం కూడా ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి నియోజకవర్గానికి చెందిన సత్యనారాయణ నిన్న జనసేనలో చేరిన విషయం తెలిసిందే. అలాగే రాబోయే రెండు వారాల్లో పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తోంది.