పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాత వాసి’ నిరుత్సాహ పరిచినా ఆ ప్రభావం తమ రాజకీయాలపై వుండబోదని జనసేన ప్రతినిధులు అంటున్నారు. మొదటి నుంచి ఈ రెండు రంగాలను విడివిడిగా చూడటం తమ విధానంగా వుందని స్పష్టం చేస్తున్నారు. సినిమాలన్నాక జయాపజయాలుంటాయి గనకే పవన్ ఆ చైతన్యం కలిగించారట. అసలు జనసేన కార్యాలయంలో ఎప్పుడూ సినిమాల చర్చలే వుండవని కూడా ఒక ముఖ్య నేత చెప్పారు. అజ్ఞాతవాసి ఒకింత నిరుత్సాహం కలిగించిన మాట నిజమేనని అంగీకరించారు. మరోవైపున కత్తిమహేష్ వంటివారు అదేపనిగా తమ నాయకుడిపౖౖె దాడి చేయడం వెనక రాజకీయాలున్నాయని వారంటున్నారు. అయితే ఆయన మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆ విధంగా స్పందించబోరనీ, తమను కూడా పట్టించుకోవద్దనే చెబుతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. యువత పవన్పట్ల చూపిస్తున్న ఆదరణ సాధారణమైంది కాదని అందుకే వ్యతిరేకులు భరించలేకపోతున్నారని వారంటున్నారు.