పవన్ కల్యాణ్‌ను బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్, నితిన్ లాంటి వాళ్లను ప్రత్యేకంంగా పిలిచి మరీ చర్చించారు కానీ తమతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్‌కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఆయనను అమిత్ షా పట్టించుకోవడం లేదు. పవన్ కల్యాణ్ అమిత్ షాను కలిసింది చాలా తక్కువ. మంచి ప్రజాదరణ ఉన్న స్టార్.. కలవాలని వస్తే పెద్దగా ఆసక్తి చూపని అమిత్ షా.. పార్టీతో సంబంధం లేని స్టార్లకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు.
అమిత్ షా పిలిచి విందు ఇచ్చినంత మాత్రాన ఎన్టీఆర్ లేదా నడ్డా పిలిచారని నితిన్ బీజేపీలో చేరుతారనో.. బీజేపీకి మద్దతుగా మారుతాడనో అనుకోలేరు. అయితే పవన్ మాత్రం వేరు. ఆయన బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. కానీ స్టార్ డం ఉన్న పవన్‌ను మాత్రం లైట్ తీసుకుంటున్నారు. కానీ ఆ స్టార్ల కన్నా పవన్ కల్యాణ్ వల్లే బీజేపీకి ఎక్కువ లాభం ఉంటుంది. ఆ విషయం బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. కానీ బీజేపీ.. జనసేన మధ్య ఉన్న ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్లే వారి మధ్య దూరం పెరిగిపోతోందన్న వాదన ఎక్కువ వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ పార్టీ తరపున ఢిల్లీ బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించడానికి.. తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవడానికి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సింది. కానీ అలాంటి పార్టీ నిర్మాణం ఏమీ చేయలేకపోయారు. అయితే పవన్ లేకపోతే నాదెండ్ల.. వారు పట్టించుకోకపోతే.. ఇక పార్టీలో ఏ వ్యవస్థ పని చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితులతో బీజేపీ… జనసేన మధ్యదూరం పెరిగితోంది. అసలు జనసేనతో ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా పోయాయని ఏపీ బీజేపీ నేతలు అనుకుంటున్నారు. అందుకే వారు జనసేనతో సంబంధం లేనట్లుగా మాట్లాడుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు.