ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి.. పని చేయడం ప్రారంభించి రెండు నెలలు దాటిపోయింది. కొత్త సర్కార్ కాబట్టి.. కొంత కాలం సమయం ఇవ్వాలని అన్ని పార్టీలు ముందుగా అనుకున్నా… కొత్త ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు ముందుకేస్తూ ఉండటంతో.. సమయం ఇవ్వడం సముచితం కాదని.. ఆయన పార్టీలు కూడా భావిస్తున్నాయి. అందుకే… సమయం ఇస్తున్నామని చెప్పినప్పటికీ… తమ మార్క్ విశ్లేషణ ప్రారంభిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాజకీయ పోరాటం ప్రారంభించగా… చట్ట సభలో ప్రాతినిధ్యం దక్కిన జనసేన పార్టీ కూడా… తమ వాయిస్ వినిపించడం ప్రారంభించింది. రెండు నెలల జగన్మోహన్ రెడ్డి పాలనపై.. జనసేన పార్టీ పెదవి విరిచింది.
రెండు నెలల్లోనే.. జగన్మోహన్ రెడ్డి.. ప్రజలు తనపై పెట్టిన ఆశలను వమ్ము చేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజల్లో.. ప్రభుత్వంపై రెండు నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తేల్చేశారు. నిజానికి ఇదే రాపాక వరప్రసాదరావు.. అసెంబ్లీ సమావేశాల్లో… జగన్మోహన్ రెడ్డిపై.. ప్రశంసల వర్షం కురిపించారు. ఇంద్రుడు.. చంద్రుడు అని.. రాగం అందుకున్నారు. ప్రజలు కోరినవన్నీ చేస్తున్నారన్నారు. అయితే.. వెంటనే ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. జనసేన పార్టీ తరపున ఏకైక ఎమ్మెల్యేగా… ఆయన వాయిస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే.. వైసీపీ సర్కార్ పై విమర్శలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
జనసేన పార్టీ అధినేత .. పవన్ కల్యాణ్.. మాత్రం… సర్కార్ కు వంద రోజుల సమయం ఇస్తానని ప్రకటించారు. ఇయితే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా… నిర్మాణ రంగ కూలీలకు ఉపాధి పోవడంతో… వారి తరపున ఆయన లేఖ రాశారు. వారికి సాయం చేయాలని కోరారు. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ఆ లేఖను పట్టించుకోలేదు. ఈ తరుణంలో.. వరప్రసాద్ మాటలు… నిర్మాణ రంగ కూలీల కోసం… పవన్ కల్యాణ్.. వంద రోజుల కంటే.. ముందే రంగంలోకి దిగుతారా.. అన్న చర్చ జనసేనలో నడుస్తోంది.