జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గుంటూరులోని లూథరన్ పాఠశాల ఆవరణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
జనసేన పార్టీ కార్యాలయం పూర్తి అత్యాధునిక సదుపాయాలతో ముస్తాబయ్యింది. పవన్ కళ్యాణ్ విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ రోజు గుంటూరు చేరుకోనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లాంటివాళ్ళు గుంటూరులో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ కూడా పార్టీ కార్యాలయ భవన నిర్మాణాన్ని చాలాకాలంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇక గత ఏడాది గుంటూరు లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో అధికార తెలుగుదేశం పార్టీ మీద విరుచుకు పడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు గుంటూరులోని భారీ బహిరంగ సభలో మాట్లాడుతారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. తను బస చేయబోయే లాడ్జి నుంచి బహిరంగ సభ ప్రాంగణం వరకు పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.