యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యూరేనియం తవ్వకాలు ప్రారంభమవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. వరుస ట్వీట్లతో.. ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూరేనియం తవ్వకాలు జరుగుతున్న విషయం కలెక్టర్‌కు తెలియదన్నట్లుగా ప్రకటనలు చేయడంపై.. పవన్ కల్యాణ్ ఆశ్చర్యం చేశారు. యూరేనియం తవ్వకాల్లాంటివి ప్రభుత్వ అనుమతులతో తప్ప… ప్రభుత్వం రక్షణ కల్పిస్తే తప్ప జరిగే అవకాశం లేదు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ తన ట్వీట్లలో నర్మగర్భంగా చెప్పారు. ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా.. విప్లవగాయని విమలక్క.. పాడిన పాటను.. తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు జనసేన అధినేత. నల్లమలను కాపాడుకోవడానికి తామంతా ఉన్నామని.. స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లడానికి ఓ “మాసివ్” సమస్య కోసం చూస్తున్నారు. అది యూరేనియమే కావడం ఖాయంగా కనిపిస్తోంది. యురేనియం తవ్వకాలను పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తవ్వకాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో.. జరిగిన ఉద్యమానికి.. పవన్ మద్దతు ప్రకటించారు. రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో తెలంగాణలో కన్నా.. ఏపీలోనూ.. యూరేనియం సమస్య ఉందని.. ఇంకా అక్కడ సమస్య తీవ్రంగా ఉందని.. ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించేశారన్న విషయాన్ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గుర్తి చేసి.. అక్కడ పోరాడాలని పవన్ కల్యాణ్‌కు సలహా ఇచ్చారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
యూరేనియానికి వ్యతిరేకంగా ఎలాంటి పోరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నదానిపై చర్చలు జరుపుతూండగానే.. అధికారులు.. ఆళ్లగడ్డ ప్రాంతంలో డ్రిల్లింగ్ ప్రారంభించేశారు. దీనిపై.. టీడీపీ నేతలు.. మండి పడుతున్నారు. డ్రిల్లింగ్ చేస్తున్న వారిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అయితే.. ఇది ఇంతటితో ఆగిపోయే పరిస్థితి కాదు. అందుకే పవన్ కల్యాణ్.. రంగంలోకి దిగాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని.. ఉద్దేశాన్ని ట్వీట్ల ద్వారానే చాటి చెబుతున్నారు. పవన్ ప్రస్తుతానికి వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్.. వారం రోజుల్లో.. ఈ వ్యవహారంపై ప్రత్యక్ష కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పులివెందుల, ఆళ్లగడ్డల్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది.
AP Govt should give a clarity, regarding the drilling for uranium in Allagadda( As the report says…). How come AP govt doesn’t have any clue about it? It’s surprising that dist collector doesn’t know about it.
— Pawan Kalyan (@PawanKalyan) September 29, 2019