జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు పాలైన రైతులను పరామర్శించడానికి ఆయన చేసిన పర్యటనకు స్పందన అద్భుతంగా రావడం పార్టీ లో జోష్ నింపింది. పైగా గతంలో చిరంజీవిని తిరుపతి గెలిపించింది అని పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో భాగంగా చెప్పడం, తిరుపతిలో చిరంజీవి నిర్వహించిన సభ స్థాయిలో ఆ తర్వాత వివిధ పార్టీలు జరిపిన రాజకీయ సభలలో దేనికీ అంత స్పందన రాలేదని చెప్పడం గమనార్హం. అయితే ఈ పర్యటనలో వచ్చిన స్పందనను, జోష్ ని కొనసాగించడానికి, రాబోయే తిరుపతి ఎంపీ ఎన్నికలలో తమ కూటమి తరపున నిలబడే ఉమ్మడి అభ్యర్థి విజయావకాశాలు మెరుగు పరచడానికి ఈ సభ దోహదం చేస్తుంది అన్న ఉద్దేశంతోనే జనసేన వర్గాలు ఈ భారీ బహిరంగసభకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరి ఈ బహిరంగ సభ తేదీ ల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సభ ఎంతవరకు తిరుపతి ఎంపీ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.