కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పవన్ కల్యాణ్ కలవలేదు. గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చి చాలా మందిని కలిశారు కానీ ముద్రగడ ఇంటి వైపు వెళ్లలేదు. దీనిపై ముద్రగడ నిష్ఠూరమాడారని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ పవన్ ఇంటికి వచ్చి మరీ తమ పార్టీలోకి ఆహ్వానించేంత గౌరవం ఆయన ఎప్పుడైనా నిలుపుకున్నారా అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానమే దొరకదు.
పవన్ వారాహియాత్ర చేస్తూ.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు చేస్తే వైసీపీ వ్యూహాన్ని ముద్రగడ అమలు చేశారు ఆయన గొప్పవాడని.. పవనే చేతకాని వాడన్నట్లుగా చాలెంజ్ లు చేస్తూ విమర్శలు చేశారు. కానీ ఇప్పుడేమయింది…? ఆయనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని.. జనవరి ఒకటో తేదీన వైసీపీలో చేరే ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ ఆయనకు ఎక్కడా టిక్కెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం.. టిక్కెట్ల కసరత్తు లో అసలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. వైసీపీలో చేరడం లేదని ప్రకటించారు.
ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలోనూ తన పలుకుబడి కోల్పోయారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసింది. అయితే ఈ అంశంపై ముద్రగడ పద్మనాభం పెద్దగా స్పందించలేదు. పైగా పవన్ ను కించ పరిచారు. ఈ అంశాలతో ఆయనన దగ్గరకు తీయకపోవడమే మంచిదని జనసేన కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.