జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజకీయ విలువలు లేవని చెప్పేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి..చేసిన వ్యక్తిగత విమర్శలు రాజకీయవర్గాల్లో కలరేపాయి.కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తారన్న వ్యాఖ్యలపై జనసేన పార్టీ నిర్వేదంగా స్పందించింది. “జగన్ నోట మంచి మాటలు రావాలని అందరూ దేవుణ్ని ప్రార్థిద్దాం.. అంతకంటే చేయగల శక్తి కూడా మన దగ్గర లేదని..” ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు మాదాసు గంగాధరం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యానించారు. జగన్ ఒక అపరిపక్వమైన రాజకీయ నేత . ఆయనకు పరిపక్వత రావాలని, అసహనం తగ్గించుకోవాలన్నారు.
పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం హుందాగా లేవని గంగాధరం విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత…. విమర్శలు చేయడం తప్పదని, కానీ.. వ్యక్తిగతంగా, కుటుంబ గురించి మాట్లాడడం మంచిది కాదన్నారు. సంకుచిత ధోరణితో మాట్లాడే ప్రతిపక్ష నేత మనకు ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించరని గుర్తు చేశారు. జగన్ సభలో ఉండి పోరాడాలని..పవన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని మాదాసు గంగాధరం ప్రశ్నించారు. పవన్ లా పెళ్లిళ్లు చేసుకుకుంటే .. సామాన్యులైతే ఈ పాటికి బొక్కలో వేసి ఉండేవారన్న జగన్ వ్యాఖ్యలపైనా మాదాసు గంగాధరం స్పందించారు. పవన్ చట్టపరంగా విడాకులు తీసుకున్నారని గుర్తు చేశారు. జగన్ వ్యవస్థలను దుర్వినియోగం చేసి…అవినీతికి పాల్పడి.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారన్నారు.
పవన్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కల్యాణ్ స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని భావించారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జన పార్టీ తరపున మాత్రం స్పందించారు. అదీ కూడా.. జగన్ కు మంచి బుద్ది రావాలని ప్రార్థన చేయడం మినహా ఇంకేమీ చేయగలిగే శక్తి లేదని వ్యాఖ్యానించడం జనసేన వర్గాలనే ఆశ్చర్యపరించంది. జగన్‌ను గట్టి విమర్శించలేకపోవడం… రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. వ్యక్తిగత విమర్శలు కాబ్టటి.. పవన్ కల్యాణ్ స్పందించడం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ పవన్ కల్యాణ్ .. పోరాటయాత్రలో ఫ్లోలో.. తన టెంపర్ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.