సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించడం కోసం చిరంజీవి జగన్ నిన్న భేటీ కావడం అటు సినీ పరిశ్రమలోనే కాకుండా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా చిరంజీవి జగన్ లు ఏకాంతంగా భేటీ కావడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి భుజాలమీదుగా తుపాకీ పెట్టి చిత్ర పరిశ్రమ వైపు గురి చూసి కాల్చేలా వైకాపా కుట్ర చేస్తోందంటూ స్పందించారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్. వివరాల్లోకి వెళితే..
చిరంజీవి జగన్ ల భేటీ మీద స్పందిస్తూ జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ప్రస్తుత రోజుల్లో మంచితనం పనిచేయదు మాస్టారూ??? నిన్న చిరంజీవి గారికి ఒక్కరినే చర్చలకు పిలిచి ఒంటరిగా మాట్లాడడం ఏదైతే ఉందొ.. దాన్ని అవకాశం గా మలుచుకుని, ఎవరైతే సమస్య సృష్టించారో, వారే సమస్యను పరిష్కరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుని ఎటువంటి కుట్ర చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయంటే – తుపాకీని చిరంజీవి గారి భుజంపై పెట్టి చిత్ర పరిశ్రమకి గురిపెట్టడం, సమస్య పరిష్కారం కాకపోతే దానికి చిరంజీవి గారిని పరిశ్రమ వర్గీయులు బ్లేమ్ చేసేలా చేయడం, మరీ ముఖ్యంగా చిరంజీవి గారు పరిశ్రమ కోసం కాదు తనకి రాజ్యసభ సీటు కోసం చర్చించడానికి వచ్చారని తన అనుకూల మీడియాకి ఫీలర్లు వదలి అల్లరి చేయడం, పెయిడ్ జర్నలిస్టులతో ఆర్టికల్స్ రాయించడం, రాజకీయ పార్టీల వారితో చిరంజీవి గారిపై విమర్శలు చేయించడం, పనిలో పనిగా మెగా కుటుంబంపై బురద జల్లడం, విభజనలు సృష్టించడం…. ఇలా చాలా కుట్రలకి ప్లాన్ చేశారని అంటున్నారు విశ్లేషకులు నిజమేనంటారా ???” అని రాసుకొచ్చారు.
మొత్తం మీద చిరంజీవి జగన్ లు భేటీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మరో రెండు మూడు వారాల్లో తెలియనుంది.