కొద్ది రోజుల క్రితం.. హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన మహా టీవీ బృందం … మూర్తి ఆధ్వర్యంలో.. ప్రైమ్ టైమ్ లో హైలెట్ చేసింది. పవన్ కల్యాణ్ తన సామాజివర్గంలో బాగా డబ్బున్న పారిశ్రామిక వేత్తలను పిలిచి.. పార్టీ కోసం నిధులు వసూలు చేశారన్నది అందులో ప్రధానమైన అభియోగం. అయితే.. చానల్ యాజమాన్యం.. వెంటనే టెలికాస్టింగ్ను ఆపేయాలని ఆదేశించడంతో.. ఆయన చానల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి జనసేన శతఘ్ని టీం కానీ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కానీ… మూర్తిని టార్గెట్ చేశారు. అసత్యాలు ప్రచారం చేశారనే మూర్తిని తీసేశారని పోస్టులు పెట్టారు. అది సీక్రెట్ మీటింగ్ కాదని… ఇన్విటేషన్లు పంపి మరీ జరిగిన మీటింగ్ అన్నారు. అంతిమంగా మూర్తి అవినీతి పరుడు కోట్లు సంపాదించాడని కూడా పోస్టులు పెట్టారు.
మహాటీవీ నుంచి బయటకు వెళ్లిపోయిన మూర్తి… ఈ పోస్టులన్నింటిని చూసి.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడానికి ఓ యూట్యూబ్ చానల్లో… సవాళ్లతో కూడినా.. వివరణ లాంటి చాలెంజ్ విసిరారు. దాదాపుగా 18 నిమిషాల పాటు… తన నిజాయితీ గురించి చెప్పారు. తన జర్నలిజం విలువల గురించి చెప్పారు. అలాగే.. సీక్రెట్ మీటింగ్లో పవన్ కల్యాణ్ వసూలు చేసిన నిధుల వ్యవహారం గురించీ పూసగుచ్చినట్లు చెప్పారు. అది సీక్రెట్ మీటింగేనని… తేల్చి చెప్పారు. సీక్రెట్ మీటింగ్ కాకపోతే.. మీడియాను ఎందుకు పిలవలేదు..? సొంత చానల్ 99 టీవీలో ఎందుకు ప్రసారం చేయలేదనిసూటిగా ప్రశ్నించారు. తను జనసేనకు వ్యతిరేకం కాదని… కానీ పవన్ కల్యాణ్ చెప్పే ఆదర్శాలకు.. చేస్తున్న దానికి పొంతన లేకపోవడాన్నే తాను ఎత్తి చూపానన్నారు. ఏ పార్టీ అయినా.. .తన విధానంలో మార్పు ఉండబోదన్నారు.
కాపులతో మాత్రమే పవన్ కల్యాణ్ సమావేశమయ్యారని… అందులో పాల్గొన్న ఓ వ్యక్తి మాటలను కూడా.. వీడియోలో… ప్రజెంట్ చేశారు మూర్తి. అంతటితో ఆగిపోలేదు..తన దగ్గర జనసేనకు చెందిన నిఖార్సైన నిజాలు చాలా ఉన్నాయని.. కానీ.. సందర్భంగా కాదని మాత్రమే బయటపెట్టడం లేదని తేల్చి చెప్పారు. తను బయపెట్టిన అంశంపైన కానీ.. తనపై జనసేన కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలపైన కానీ… చర్చకు తాను సిద్ధమని..సవాల్ చేశారు. 99 టీవీ స్టూడియోకి అయినా వస్తానని చాలెంజ్ చేశారు. మూర్తి ఇంతగా .. తొడ కొట్టిన తర్వాత.. జనసేన ఫ్యాన్స్ ఊరుకునే అవకాశం లేదు. అంతకు రెండింతలు సమాధానం చెబుతారు. దాంతో.. కొన్ని రోజుల పాటు.. ఆన్లైన్లో .. మూర్తి వర్సెస్ జనసైనిక్స్ అన్నట్లుగా..వ్యవహారం సాగే అవకాశం ఉంది. ఇది టీవీలకు ఎక్కినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో..?