జనతా గ్యారేజ్ సినిమాకి ఆఖర్లో రిపేర్లు జరిగిన సంగతి తెలిసిందే. నిడివి ఎక్కువైపోవడంతో 12 నిమిషాల సన్నివేశాల్ని కత్తిరించారు. ఫస్టాఫ్‌లో కొన్ని, సెకండాఫ్‌లో ఇంకొన్ని సీన్లకు కత్తెర్లు వేశారు. తెలుగు వెర్షన్‌కి ఎడిట్ చేసిన సినిమానే వచ్చింది. ఆల్రెడీ ఓవర్సీస్కి సినిమా పంపించేయడం వల్ల… ఆఖరి నిమిషాల్లో లేపేసిన సీన్లు కూడా ఓవర్సీస్ ప్రింట్లలో దర్శనమిచ్చాయి. దుబాయ్‌లో ఎడిట్ చేయని వర్షనే ప్రదర్శితం అవుతోంది. జనతాలో ఇక్కడ లేని సన్నివేశాలు ఇప్పుడు యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్‌కి సంబంధించిన ఓ సీన్ బయటకు వచ్చింది. అపార్ట్మెంట్వాళ్లందరినీ ఓ చోట పోగేసి మొక్కల ఆవశ్యకత చెప్పే సీన్ అది. అందులో ఎన్టీఆర్‌తో పాటు సమంత, సితారలు కూడా ఉన్నారు. ఇక్కడ తొలగించిన 12 నిమిషాల సన్నివేశాల్ని త్వరలోనే చిత్రబృందం యూ ట్యూబ్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. తొలగించిన సీన్లను మళ్లీ ఎడిట్ చేయడం, ట్యూబుల్లోకి ఎక్కించడం కాస్త ఖర్చుతో కూడుకొన్న పని. అందుకే.. నేరుగా యూ ట్యూబ్‌లోనే విడుదల చేయాలన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది. తెలుగు తెరపై కనిపించిన ఎన్టీఆర్ సన్నివేశాన్ని మీరిక్కడ చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=qjroiobRLMc