జాన్వీ ముందున్న పెద్ద సవాల్

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. తల్లి శ్రీదేవి కూడా జాన్విని తెలుగులో తీసుకురావాల‌ని బలంగా కోరుకునేవారు. మరో రెండు వారాల్లో ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై కనిపించబోతోంది జాన్వి. ఆమెపై రెండు భాద్యతలు వున్నాయి. శ్రీదేవి వారాసురాలిగా జాన్విపై ఖచ్చితంగా ఒత్తిడి వుంటుంది. ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా మెప్పించడం మరో భాధ్య‌త‌.

ఇప్పటి వరకూ బయటికి వచ్చిన కంటెంట్ జాన్వి ప్రజెన్స్ వావ్.. అద్భుతం అనేలా ఏమీ లేదు. డ్యాన్సుల్లో కూడా యావరేజ్ మార్కులే పడ్డాయి. జాన్వి లుక్స్ పై చాలా డౌట్స్ వున్నాయి. ఈ పాత్రకు ఆమె లుక్స్ సహజంగా లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమెది రూరల్ రస్టిక్ రోల్. కానీ ఆమె అప్పీరియన్స్ లో అర్బన్ లుక్ డామినేట్ చేస్తోంది. రంగస్థలంలో రామలక్ష్మీ పాత్రలో సమంత దూరిపోయింది. పుష్ష‌లో శ్రీ‌వ‌ల్లీ పాత్రలో ర‌ష్మిక అద‌ర‌గొట్టింది. తంగం కూడా అలాంటి టచ్ వున్న క్యారెక్టరే. కానీ ఆ వైబ్ రావడం లేదు. రెండు నిమిషాల ట్రైల‌ర్ చూసి జాన్వీ పాత్ర ఎలా ఉంటుందో డిసైడ్ చేయ‌డం క‌ష్టం. సినిమా వ‌స్తే కానీ, జాన్వీ ప్ల‌స్సులూ, మైన‌స్సులూ పూర్తిగా అర్థం కావు.

పైగా కొరటాల శివ మాట‌లు జాన్వి క్యారెక్టర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో రాయడానికి కష్టపడ్డ క్యారెక్టర్ జాన్విదే అని, తంగం చాలా డిఫికల్ట్ క్యారెక్టర్ అని, ఆ క్యారెక్టర్ లో పెర్ఫార్మ్ చేయడం కూడా అంత ఈజీకాదని కొర‌టాల శివ పేర్కొన్నారు. అంటే నటనకి కూడా ఆస్కారం వుండే పాత్ర అనుకోవాలి. ఎన్టీఆర్ మంచి పెర్ఫామర్, డ్యాన్సర్. ఆయనకి తగ్గట్టుగా నిలబడటం, తన ప్రజెన్స్ నిలబెట్టుకోవడం జాన్వి ముందున్న పెద్ద సవాల్. మరి సవాల్ ని జాన్వి ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close