విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి కూడా విజయ్ అంటే ఇష్టం. తెలుగులో తన ఫేవరేట్ స్టార్స్ లిస్టు లో విజయ్ పేరు కూడా చెబుతుంది జాన్వీ. అంతేకాదు.. ఒక సందర్భంలో ‘‘మీకు ఒకవేళ స్వయంవరం ఏర్పాటు చేస్తే పరిశ్రమ నుంచి ఎవరు అందులో పాల్గొనాలని అనుకుంటున్నారు’’? అనే ప్రశ్నకు .. విజయ్ పేరుని కూడా ప్రస్థావనకు తీసుకురావడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.
అదలావుంచితే.. జాన్వీ, విజయ్ ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం వుంది. ఇటివలే ముంబైలో విజయ్ ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్ళాడు. ఈ యాడ్ లో జాన్వీ కూడా నటించింది. ఈ సందర్భంగా విజయ్ తల్లి మాధవి జాన్వీ ని కలిసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. షూటింగ్ తర్వాత విజయ్ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించిందట జాన్వీ. విజయ్, జాన్వీ కలసి సినిమా చేస్తే బావుంటుందని ఎప్పటినుండో అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికైతే సినిమా కుదరలేదు కానీ ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం కుదిరింది.