థియేటర్స్ లో నిరాశ పరిచిన సినిమాలు ఓటీటీలో అలరిస్తుంటాయి. అక్కడ ఫెయిల్ మార్కులు వేసిన సినిమాలకు ఓటీటీ ఆడియన్స్ పాస్ మార్కులు వేసి సందర్భాలు వుంటాయి. జాన్వి కపూర్ ‘ఉలాజ్’ సినిమా కూడా ఓటీటీపై ఆశలు పెట్టుకుంది. నిజానికి ఈ మధ్యకాలంలో జాన్వి కపూర్ చేసిన సినిమాల్లో అతి తక్కువ ప్రచారం పొందిన సినిమా ఇది. ఈ సినిమా థియేటర్స్ కి ఎప్పుడొచ్చి వెళ్లిందో చాలా మందికి తెలీదు. గత వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజైయింది. అయితే ఇక్కడ ఆడియన్స్ ద్రుష్టిని ఆకర్షించలేకపోయింది.
ఇదొక స్పై థ్రిల్లర్. ఇండియా నుంచి లండన్ ఎంబసీలో పని చేయడానికి వెళ్లి ఓ ఐఎఫ్ఎస్ అధికారి పాత్రలో కనిపించింది జాన్వి. ఉగ్రవాదులు జాన్వి ప్రైవేట్ వీడియోను అడ్డుపెట్టుకొని దేశం రహస్యాలని చేజిక్కుంచుకోవాలని చూస్తారు. తర్వాత ఆ ట్రాప్ నుంచి జాన్వి ఎలా బయటపడిందనేది కథ.
అయితే దర్శకుడు సినిమాని చాలా వీక్ స్క్రీన్ ప్లేతో నడిపాడు. ఎక్కడ కూడా సినిమా ఆసక్తి కలిగించేలా వుండదు. లండన్ లో జాన్వి పాత్ర, బ్లాక్ మెయిలింగ్ చుట్టూ నడిపిన సన్నివేశాలు సహనానికి పరీక్ష పెడతాయి. చివర్లో ట్విస్ట్ లు వుంటాయి కానీ అప్పటికే సినిమాపై ఆసక్తి పోతుంది.
నిజానికి ఈ సినిమా కోసం జాన్వి కష్టపడింది. ఐఎఫ్ఎస్ అధికారులకు ఫిజికల్ ట్రైనింగ్ వుండదు. అలాంటి అధికారులు ఇలా బ్లాక్ మెయిలింగ్ బారిన పడితే పరిస్థితి ఏమినేది అలోచనరేకెత్తించేలానే వుంటుంది. కానీ దర్శకుడు ఈ కథని ఎంగేజింగ్ గా చెప్పడంలో పూర్తిగా తడబడ్డాడు. జాన్వి కష్టం వృధాగా పోయింది.