బాలీవుడ్లో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ వుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. విజయ్ దేవరకొండని అభిమానించే బాలీవుడ్ హీరోయిన్లలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా చేరింది. ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి అన్నయ్య అర్జున్ కపూర్‌తో కలసి జాన్వీ వచ్చింది. షోలో ఆమెకు కరణ్ ఒక ప్రశ్న వేశాడు… ‘ఒకవేళ నువ్వో రోజు ఓ మేల్ యాక్టర్‌గా నిద్ర లేస్తే… ఎవరిలా మేల్కోవాలని అనుకుంటావ్? ఎందుకు?’ అని! ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది జాన్వీ. “విజయ్ దేవరకొండలా నిద్రలేచి నాతో సినిమా చేస్తా” అని ఆమె పేర్కొంది. జాన్వీ ఉద్దేశం ఏంటంటే… తనతో విజయ్ దేవరకొండ సినిమా చేయాలని! మొత్తానికి ఆమె కన్ను విజయ్ దేవరకొండపై పడినదన్నమాట. షోలో ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే.. అతడు ఎవరో తెలియని ప్రేక్షకులు వుంటారేమోనని కరణ్ జోహార్ ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చేసిన హీరో అనీ, హిందీలో ఆ సినిమా షాహిద్ కపూర్ చేస్తున్నాడని చెప్పాడు. విజయ్ దేవరకొండ చాలా టాలెంటెడ్ అని అర్జున్ కపూర్ అన్నాడు. విజయ్ దేవరకొండతో సినిమా చేసే దక్షిణాది నిర్మాతలు ఎవరైనా జాన్వీని సంప్రద్రిస్తే వెంటనే అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయ్.