తన వద్ద అసిస్టెంట్ కొరియాగ్రాఫర్ గా పనిచేసిన మహిళను లైంగిక వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ, పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐదు రోజులుగా జానీ మాస్టర్, ఆయన భార్య కోసం పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. లడ్డాక్, ఢిల్లీతో పాటు నెల్లూరులో ఆయన కోసం గాలింపు చేశారు. ఫైనల్ గా ఆయన గోవాలో ఉన్నట్లు తెలుసుకున్న సైబరాబాద్ ఎస్.వో.టీ పోలీసులు… అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ స్థానిక కోర్టులో జానీ మాస్టర్ ను హజరుపర్చి, పీటీ వారెంట్ కింద హైదరాబాద్ తరలిస్తున్నారు.
జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారంటూ… కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఓ డ్యాన్స్ షోలో తన వద్ద అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుండే వేధింపులు మొదలయ్యాయని, ఆ తర్వాత సినిమా ఛాన్స్ ల పేరుతో కొనసాగయని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ స్టేట్మెంట్ ను ఇప్పటికే పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటనపై ఇండస్ట్రీ కూడా తీవ్రంగా స్పందించింది.