జానీ మాస్ట‌ర్ ని ఇరికించాల‌ని చూస్తున్నారా?

కొరియో గ్రాఫ‌ర్‌గా జానీమాస్ట‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చిర ప‌రిచితుడే! ఇటీవ‌లే ‘తిరు’ చిత్రానికి గానూ ఆయ‌న ఉత్త‌మ నృత్య ద‌ర్శ‌కుడిగా జాతీయ అవార్డు కూడా సాధించారు. జ‌న‌సేన‌కు బ‌ల‌మైన స‌పోర్ట‌ర్‌. ప‌వ‌న్ అంటే త‌న‌కు ఎంత అభిమాన‌మో.. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి అర్థం అవుతుంటుంది. జ‌న‌సేన కోసం ఆయ‌న ప్ర‌చారం చేశారు. పార్టీ టికెట్ కూడా ఆశించారు, కానీ పొత్తు ధ‌ర్మం వ‌ల్ల ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. అయినా స‌రే, నిజాయ‌తీగా పార్టీకి సేవ చేశారు. ఓ పాట కూడా జ‌న‌సేన కోసం రూపొందించారు. పాట బాగా క్లిక్ అయ్యింది.

ఇప్పుడు ఇదే జానీ మాస్ట‌ర్ ఓ రేప్ కేసులో ఇరుకొన్నారు. జానీతన‌పై ప‌లుమార్లు హ‌త్యాప్ర‌య‌త్నానికి పాల్ప‌డ్డాడ‌ని నార్సింగ్ పోలీస్ స్టేష‌న్ లో ఓ మ‌హిళ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు పోలీసులు జానీపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. జానీపై క్లీన్ ఇమేజ్ ఉంది. త‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి కంప్లైంటూ బ‌య‌ట‌కు రాలేదు. త‌ప్పు చేస్తే జానీ శిక్ష అనుభ‌వించాల్సిందే. కానీ జానీపై కేసు విష‌యంలో కుట్ర కోణం ఏదైనా ఉందా? ఆయ‌న్ని కావాల‌ని ఇరికించాల‌ని చూస్తున్నారా? అనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. జానీ చాలా మంచోడ‌ని, ఆయ‌న మ‌హిళల ప‌ట్ల గౌర‌వంగా మ‌సులుకొంటార‌ని జానీ స‌న్నిహితులు చెబుతున్నారు. రాజ‌కీయంగానూ ఎద‌గాల‌నుకొంటున్న త‌రుణంలో జానీపై కావాల‌ని ఎవ‌రైనా ఇరుకున ప‌డేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారా, లేదంటే… నిజంగానే జానీ ఈ త‌ప్పు చేశారా? అనే విష‌యాలు నిర్ణ‌యించాల్సింది పోలీసులూ, న్యాయ స్థానాలే. కాక‌పోతే.. కొంత‌కాలం పాటు టాలీవుడ్ లో మాట్లాడుకోవ‌డానికి, రాజకీయంగా ఒక‌రిపై మ‌రొక‌రు బుర‌ద చ‌ల్లుకోవ‌డానికీ ఓ హాట్ టాపిక్ దొరికిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close