రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుడుతాం అంటూ ప్రకటించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… తను చెప్పిన మాటలను ఆచరణలో పెట్టే ప్రయత్నంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా మహిళలపై వేధింపుల విషయంలో పార్టీ పంపిన స్ట్రాంగ్ సిగ్నల్స్ ఎంతో ప్రభావం చూపనున్నాయి.
కొంతకాలంగా వైసీపీ నేతలతో పాటు ఆనాడు కీలకంగా ఉన్న అధికారులపై సైతం ఎన్నో ఆరోపణలు. జత్వానీ కేసు ఒక్కటే కాదు బయటకు రాకుండా మహిళలపై జరిగిన కీచకపర్వాలు ఎన్నో. స్వయంగా తమ పార్టీ నేతలపై ఆధారాలతో సహా బయటకు వస్తున్నా వైసీసీ రెస్పాండ్ కాదు. జగన్ నోరు తెరవరు.
కానీ, తనతో…జనసేనతో చాలా కాలంగా కొనసాగుతున్న జానీ మాస్టర్ పై వేధింపుల కేసు నమోదైంది. తన టీంలో ఉన్న ఓ మహిళా కొరియోగ్రాఫర్… జానీ మాస్టర్ పై కేసు పెట్టింది. కేసు నమోదు కావటం, ఎఫ్.ఐ.ఆర్ కూడా బుక్ అయినా జానీ మాస్టర్ స్పందించకపోవటంతో జనసేన సీరియస్ గా తీసుకుంది. జనసేన కార్యక్రమాల నుండి తనను దూరంగా ఉంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ సూచనతో పార్టీ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది.
అంతకు ముందు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలోనూ టీడీపీ అంతే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా… ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి, మహిళల పట్ల టీడీపీకి వైఖరేంటో చెప్పకనే చెప్పింది. తాజాగా కూటమిలోని జనసేన కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యింది.
దీంతో… వైసీపీకి, కూటమికి ఉన్న తేడా ఇది… పరిపాలనే కాదు పార్టీ నేతల విషయంలోనూ తామేంటో చూడండి. వైసీపీకి ఇలా చర్యలు తీసుకోవటం సాధ్యమవుతుందా అంటూ కూటమి క్యాడర్ జోష్ లో విమర్శలు చేస్తోంది.