కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతూండగా సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. జన్వాడ రిజర్వ్ కాలనిలో రాజ్ పాకాల ఫాం హౌస్ లో ఉంది. ఆ ఫాంహౌస్లో పెద్ద శబ్దాలతో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఫిర్యాదు రావడంతో స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. రాజ్ పాకాల ఫాం హౌస్ లో పాల్గొన్న వాళ్ళ కి డ్రగ్స్ టెస్ట్ చేశారు. ఒకరికి కోకైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా తేలడంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అదే సమమయంలో భారీగా ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించిన పోలీసులు. Section 34, Excise Act కింద మరో కేసు నమోదు చేశారు.
డ్రగ్స్ పార్టీలో మొత్తం 42 మంది పాల్గొన్నారు. వీరిలో రాజ్ పాకాలా ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. రాజ్ పాకాల ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు. హై ప్రోఫైల్ ఈవెంట్లను నిర్వహించేవారు. ఆయన పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తూంటారని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించేవారు. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో జరుగుతున్న పార్టీ ఆయన ఆర్గనైజ్ చేశారా లేకపోతే ఫామ్ హౌస్ ను రెంట్ కు ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది.
కొద్ది రోజుల కిందట డ్రగ్స్ కేసులో రాజ్ పాకాల అనే వ్యక్తి ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. అవి అవాస్తవాలంటూ.. పరువు నష్టం అంటూ..ఒక్కో సంస్థపై వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు రాజ్ పాకాల. ఇలా తరచూఆయన పేరు డ్రగ్స్ పార్టీల్లో వెలుగులోకి వస్తూనే ఉంటుంది. జన్వాడలో కేటీఆర్కు కూడా ఫామ్ హౌస్ ఉంది. పార్టీ జరిగింది మాత్రం ఆయన బావమరిది ఫామ్ హౌస్లో.