ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ విషయంలో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను తక్షణం కేంద్రం సర్వీసుల్లో చేరేందుకు అనుమతి ఇచ్చింది. ఆయనపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ విధించిన సస్పెన్షన్‌ను కొట్టి వేసింది. అయితే.. ఆయనపై అభియోగాలు ఉన్నాయంటూ.. ఏపీ సర్కార్ చెప్పిన విషయాలపై విచారణ జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. జాస్తి కృష్ణకిషోర్.. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఉద్యోగి. ఆయన టీడీపీ హయాంలో.. రాష్ట్ర ఆర్థికాభివృద్ది సంస్థ… ఈడీబీకి చైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ.. ఆయనపై ఏపీ సర్కార్.. సీఐడీ కేసులు నమోదు చేయించింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. జీతం ఇవ్వలేదు.
క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతే జీతం చెల్లించారు. ఇప్పుడు సస్పెన్షన్‌ను క్యాట్ కొట్టి వేసింది. జాస్తి కృష్ణకిషోర్ గతంలో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పని చేశారు. ఆ సమయంలో.. జగన్ అక్రమాస్తుల కేసులో… కొన్ని నివేదికలను తన బృందంతో కలిసి ఇచ్చారు. ఆ కారణంగానే జగన్ ఆయనపై కక్ష పెట్టుకున్నారన్న ఆరోపణలు రాజకీయంగా వినిపించాయి. కేంద్ర సర్వీసులకు వెళ్తానన్న ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. చివరికి ఆయన క్యాట్‌ను ఆశ్రయించి.. కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన అనేక మంది అధికారులకు పోస్టింగులు, జీతాలు లేవు.
ఏడెనిమిది నెలల తర్వాత కొంత మందిపై సస్పెన్షన్ వేటువేసి.. కేసులు పెట్టడం ప్రారంభించారు. ఇలాంటి వారిలో జాస్తి కృష్ణకిషోర్ తో పాటు… ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు ఉన్నారు. ఆయన కూడా.. క్యాట్‌ను ఆశ్రయించారు. మరికొంత మంది అధికారులకూ ఇప్పటి వరకూ పోస్టింగ్‌లు లేవు.