అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ‘జత కలిసే’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రేపటి దర్శకులు’ అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి సినిమాను గ్రాండ్ లెవల్లో డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. విక్కి, సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్ లోని జె.ఆర్.సి సెంటర్ లో నిర్వహించారు. బిగ్ సీడీని, ఆడియో సీడీలను రాజమౌళి ఆవిష్కరించారు. తొలి సీడీని యం.యం.కీరవాణి అందుకున్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను కూడా కీరవాణి విడుదల చేశారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ‘’ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్రెండ్ ఫిప్ కోసం నిర్మాతగారు ఈ సినిమాను నిర్మించారు. సాయికొర్రపాటిగారు సినిమాకు అండగా నిలబడ్డారు. ఇలాంటి మంచి సినిమాలను ఆయన ఆదరించాలని కోరుకుంటున్నాను. సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుందని భావిస్తున్నాను’’ అన్నారు.
యం.యం.కీరవాణి మాట్లాడుతూ ‘’గతంలో వచ్చిన హ్యపీడేస్ అనే చిన్న చిత్రం దిల్‌రాజు సపోర్ట్‌తో పెద్ద చిత్రంగా విడుదలై పెద్ద హిట్టయింది. అలాఏ ఈ చిత్రానికి సాయికొర్రపాటిగారు సపోర్ట్‌గా నిలబడ్డారు. చిన్న చిత్రాలకు పెద్ద నిర్మాతలు సపోర్ట్‌గా ఉంటే బావుంటుంది. సాంగ్స్, ట్రైలర్స్ బావున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ కావాలి అన్నారు.
రాకేష్ శశి మాట్లాడుతూ ‘’నా ఫస్ట్ సినిమా వారాహి బ్యానర్లో విడుదల కావడం ఆనందంగా ఉంది. నా మీద నమ్మకంతో, ఫ్రెండ్ ఫిప్ కారణంగా నిర్మాతగారు కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా తీశారు. ఓంకార్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు. సరదాగా సాగిపోయే జర్నీయే ఈ సినిమా. విక్కి, సాయికార్తీక్ మంచి మ్యూజిక్‌నిచ్చారు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అన్నారు.
ఓంకార్ మాట్లాడుతూ ‘’తమ్ముడిని హీరో చేయాలని నేను చేసిన రాజుగారి గది చిత్రం సాయికొర్రపాటి, అనీల్ సుంకరగారి సహకారంతో పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ జతకలిసే చిత్రానికి కూడా సాయిగారు అండగా నిలబడ్డారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకముంది’’ అన్నారు.
సాయికొర్రపాటి మాట్లాడుతూ ‘’రాజుగారి గది చిత్రంలో హీరోగా పరిచయం అయిన అశ్విన్ ఈ చిత్రంతో స్టార్ హీరోల లిస్టులో చేరాలి. కచ్చితంగా సినిమా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు.
రావూరి నరేష్ మాట్లాడుతూ ‘’నటీనటులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. సినిమా బాగా వచ్చింది. సాయిగారికి థాంక్స్. సినిమాను అందరూ పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
ఈ కార్యక్రంలోనారా రోహిత్ ,తారకరత్న, అశ్విన్‌బాబు, విక్కీ, అవసరాల శ్రీనివాస్, అనీల్ సుంకర, అశ్విన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
పృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, రాజుగారి గది ఫేమ్ విద్యుల్లేఖ రామన్(బుజ్జమ్మ),‘జబర్ దస్త్’ రాంప్రసాద్, సూర్య, ప్రియ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మరి కొంత మంది నూతన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: అనంత్ శ్రీరామ్, రెహమాన్, డ్యాన్స్: శేఖర్, గణేష్, విజయ్, ఫైట్స్: జాషువ, ఆర్ట్: జె.కె.మూర్తి, పిఆర్ఓ: వంశి- శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: జగదీష్ చీకటి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వైది, సంగీతం: విక్కి, సాయికార్తీక్, నిర్మాత: నరేష్ రావూరి, రచన-దర్శకత్వం: రాకేష్ శశి.