ఈ యేడాది టాలీవుడ్ చూసిన అతి పెద్ద విజయాల్లో.. `జాతిరత్నాలు` ఒకటి. నాలుగు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా 40 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈసినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో పడింది చిత్రబృందం. ముగ్గురు స్నేహితులు.. పొట్టకూటి కోసం… హైదరాబాద్ వస్తే ఏం జరిగిందన్నది జాతిరత్నాలు కథ. అదే ముగ్గురు అమెరికా వెళ్తే ఏం జరుగుతుందన్నది సీక్వెల్ పాయింట్ అట. నిజానికి జాతి రత్నాలులో పెద్ద కథేం ఉండదు. జస్ట్.. ఫన్ మాత్రమే ఉంటుంది. దానిపై గురి కుదిరితే… ఇలాంటి కథలు ఎన్నయినా వండేయొచ్చు. దర్శకుడు అనుదీప్ దగ్గర ఆల్రెడీ.. సీక్వెల్ కి సంబంధించిన పాయింట్ ఉంది. నవీన్ పొలిశెట్టి కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలన్న ఆలోచలో ఉన్నట్టు టాక్. అయితే… ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా కూడా చేయబోతున్నార్ట. అది మాత్రం కొత్త కథతో రూపుదిద్దుకుంటుంది. ఆ తరవాతే.. జాతి రత్నాలు సీక్వెల్ ఉండొచ్చు.