నవీన్ పొలిశెట్టి… ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో.. తన కామెడీ టైమింగ్ ఏమిటో రుచి చూపించాడు. ఇప్పుడు `జాతి రత్నాలు`తో… మరోసారి ప్రేక్షకుల్ని ఫన్ రైడ్ కి తీసుకెళ్లబోతున్నాడు. ఈసారి నవీన్‌కు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడుగా నిలిచారు. అనుదీప్ దర్శకుడు. నాగ అశ్విన్ నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈనెల 11న సినిమా విడుదల అవుతోంది. ఈరోజు ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ ఆవిష్కరించారు.
2 నిమిషాల నిడివిగల ట్రైలర్ ఇది. రెండు నిమిషాలూ… నాన్ స్టాప్ ఫన్ రైడ్ సాగింది. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ కిరాక్ పుట్టించిందనే చెప్పాలి.
టెన్త్‌లో సిక్ట్సీ పర్సెంట్
ఇంటర్ లో50 పర్సెంట్
బీటెక్ లో 40 పర్సెంట్.. ఏందిరా ఇది – అని అడిగితే సిగ్గు పడకుండా `అందుకే ఎంటెక్ చేయలేదు` అని చెప్పడం సూపర్ కామెడీ సెన్స్. లేడీస్ ఎంపోరియమ్ని.. లేడీస్ ఎంపవర్ మెంట్ గా మార్చేసే టెక్నిక్ కూడా ట్రైలర్లోనే తెలిసిపోయింది. పోలీస్ స్టేషన్‌కి వచ్చి.. అవుటాఫ్ స్టేషన్ అని కవర్ చేసుకోవడం ఇంకొచెం ఫన్సీ. మొత్తానికి ప్రతీ పాత్రా… ప్రతీ డైలాగ్ కామెడీ టచ్‌తోనే సాగింది. రెండు నిమిషాల్లోనే ఇంత కామెడీ పుట్టించారంటే.. రెండు గంటల్లో ఆ కామెడీ వంద రెట్లు కనిపించడం ఖాయం. మొత్తానికి సినిమా చూడాలన్న ఉత్సుకతని మరింతగా పెంచింది.. ఈ జాతిరత్నాలు ట్రైలర్.