జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే హైడ్రా జయభేరీకి .. FTL విషయంలో నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరగడంతో అంతా రియల్ ఎస్టేట్ కంపెనీకి అనుకున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ చెరువుకి కాస్త దగ్గరలో ఉన్నది కార్ సర్వీసింగ్ సెంటర్.
జయభేరికి మారుతీ నెక్సా డీలర్ షిప్స్ ఉన్నాయి. ఈ డీలర్ షిప్‌కు సంబంధించిన కార్ల సర్వీసింగ్ సెంటర్ ను.. రంగలాల్ చెరువు పక్కన ఉన్న తమ భూమిలో ఏర్పాటు చేశారు. అక్కడ శాశ్వత నిర్మాణాలేమీ లేవు. రేకులతో నిర్మిచింన వర్క్ షాప్., అందులో మూడు అడుగుల మేర ముందుకు వచ్చిదని నోటీసులు ఇచ్చారు. దానికి మురళీ మోహన్ క్లారిటీ ఇచ్చారు. ఆ మూడు అడుగుల షెడ్డు తామే తొలగిస్తామన్నారు.
కానీ ఉదయం నుంచి ఓ సెక్షన్ మీడియా.. సోషల్ మీడియాలో ఉండే కులన్మోదాలు చెలరేగిపోతున్నారు. తెలిసినా తెలియనట్లుగా జయభేరిపై నిందలు వేసేందుకు ఉత్సాహపడుతున్నారు. గూగుల్ మ్యాప్ చూసినా.. అసలు ఆ స్థలంలో ఎలాంటిని నిర్మాణాలు లేవని.. వర్క్ షాప్ షెడ్ మాత్రమే ఉందని స్పష్టతకు వస్తుది. అయినా.. మురళీమోహన ్‌పై వ్యతిరేకతను మాత్రం కొంత మంది ఇదే సందని చూపించుకుంటున్నారు.