వైసీపీ ఎమ్మెల్యే రోజా.. నోటిక ఏది వస్తే మాట్లాడటంలో దిట్ట. వెకిలి వేషాలకు పెట్టింది పేరు. మైకు కనిపిస్తే చాలు సభ్యత సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేస్తుంటారు. శాసనసభలో ఆమె ఎంతగా అసహ్యంగా ప్రవర్తించిందో తెలుగు ప్రజలందరికీ ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. సినిమాలో ఎలా నటించినా ఎవరూ పట్టించుకోరు. సినిమానే సినిమా వరకే పరిమితం చేస్తారు. కానీ రియల్ లైఫ్‌లో కూడా అలాగే చేస్తే జనానికి రోత పుడుతుంది. మరీ ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న వారు హుందాగా ఉండటం నేర్చుకోవాలి. ఆరోపణలు, విమర్శలు చేసేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలి. తమ స్థాయిని దిగజార్చుకోకూడదు. కానీ రోజా ఇలాంటి విషయాలు అసలు ఎంతమాత్రం పట్టవు. ఎదుటి వారి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా నోరు పారేసుకుంటారు. ఈమె నోటి దూల కారణంగా నంద్యాలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అయినా కూడా జగన్‌కు జ్ఞానోదయం కావడం లేదు. ఆమెను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే రోజా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ రాకెట్లో ప్రస్తావనకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. మోదీ వైఖరికి నిరసనగా గుండు కొట్టించుకుంటే మరో గుండాయన, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ఎందుకు అంత ఘనంగా స్వాగతం పలుకుతున్నారని రోజా నిలదీశారు.
గల్లా జయదేవ్‌ను ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. లోక్‌సభలో తన ఎదరుగా మోదీని, జైట్లీ ఫుట్‌బాల్ ఆడేశారు. ఆయన మాట్లాడిన తీరుకు ఏపీ జనం ఫిదా అయిపోయారు. పైగా జయదేవ్ చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఆయనెప్పుడూ ఎవరి మీద నోరు జారిన దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి మీద రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో జనానికి మండిపోతుంది. రోజా మాటలపై జయదేవ్ బాగా నొచ్చుకున్నట్లు సమాచారం. అయితే రోజా కథ తెలిసిందే కదా. అంతకంటే గొప్పగా ఆమె ఏమీ మాట్లాడదులే అని ఆయన టీడీపీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేలే.. రోజా లాంటి వ్యక్తిని చూసీ చూడనట్లు వదిలేయడమే మంచిది. వచ్చే ఎన్నికల్లో నగిరి ప్రజలు ఆమె సంగతి చూసుకుంటారు. తన పట్ల జనంలో సానుకూలత ఎందుకు రావడం లేదో జగన్‌కు సరిగా అర్థం కావడం లేదు. రోజా, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వాళ్లు చాలా జగన్ పార్టీ నిండా ముంచడానికి. ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే ఉంది. కనీసం ఇప్పటికైనా హుందాతనాన్ని అలవర్చుకోకపోతే 2014లో వచ్చిన సీట్లలో సగం సీట్లు కూడా జగన్‌కు రావు.