తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు రావడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలోని రూము నుంచి ఐసీయు కు తరలించారు. నిపుణులైన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స చేస్తున్నట్టు అపోలో ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. అమ్మకు గుండెపోటు వచ్చిందనే వార్త తెలియగానే తమిళనాడు మంత్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆస్పత్రిముందు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జయలలిత తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్లో ఆస్పత్రిలో చేరారు. చాలా రోజులు ఆమెకు ఐసీయూలో చికిత్స చేశారు. లండన్, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నిపుణులైన డాక్టర్లను రప్పించారు. వారి పర్యవేక్షణలోచికిత్స చేశారు. ఇటీవలే ఐసియు నుంచి రూముకు మార్చారు. ఆమె పూర్తిగా కోలుకున్నారని, ఎప్పుడు ఇంటికి వెళ్లాలో ఆమె ఇష్టమని అపోలో చైర్మన్ ప్రకటించారు. ఇంతలో మళ్లీ ఆమెకు గుండెపోటు వచ్చింది. అమ్మ కోలుకోవాలంటూ ఇన్ని రోజులుగా పూజలుచేసిన అభిమానులు ఇప్పుడు ఆస్పత్రి ముందు కంటతడి పెడుతున్నారు. చలిలోనే పడిగాపులు పడుతున్నారు.