విడాకులపై నటుడు జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా జయం రవి – ఆర్తి దంపతులు విడాకులు తీసుకోనున్నారని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయం రవి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు.
జీవితం ఎన్నో మలుపులతో కూడి ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది..చాలామంది నాకు మద్దతుగా నిలిచారు..అందుకే నా వ్యక్తిగత విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా..ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీ ముందు ఉంచుతున్నా అంటూ జయం రవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఎన్నో చర్చలు.. ఆలోచనల తర్వాత ఆర్తి , నేను ఓ నిర్ణయానికి వచ్చాం.. నేను , నా భార్యతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.. అంటూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని అభిమానులు గౌరవిస్తారని కోరుతున్నాను.. సున్నితమైన ఈ విషయంపై రూమర్స్ ను వ్యాప్తి చేయవద్దంటూ జయం రవి పేర్కొన్నారు.
ఇక, 2002లో నితిన్ హీరోగా విడుదలై సంచలన విజయం అందుకున్న జయం మూవీని తమిళ్ లో రిమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయకుడిగా రవి అలరించడం.. మొదటి సినిమాతోనే సత్తా చాటడంతోనే ఆయన పేరు జయం రవిగా స్థిరపడింది.