సూపర్ స్టార్ మహేష్ బాబు హవా ఓ రేంజ్లో కొనసాగుతుందని చెప్పొచ్చు. దర్శక నిర్మాతలు మహేష్ తో సినిమా కట్టడానికి క్యూ కడుతున్నారు. అయితే మహేష్ తో టక్కరి దొంగ సినిమా తీసిన జయంత్ సి. పరాంజీ మరోసారి మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడట. తీన్మార్ సినిమా తర్వాత తెలుగులో ఏ సినిమా చేయని జయంత్ మరోసారి మహేష్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ ని టక్కరి దొంగగా చూపించిన జయంత్ ఆ సినిమాను సక్సెస్ మాత్రం చేసుకోలేకపోయాడు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరెక్ట్ గా సూటయ్యే కథని రెడీ చేసి మహేష్ కి వినిపించాడట. అంతేకాదు సినిమాలో నటించడానికి మహేష్ కు బ్లాంక్ చెక్ కూడా ఇచ్చాడని టాక్. అయితే వరుసెంట సినిమాలను కమిట్ అయిన మహేష్ జయంత్ సినిమా చేయడానికి వీలులేదు. తన లేటెస్ట్ సినిమా బ్రహ్మోత్సవం షూట్లో ఉన్న మహేష్ ఈ సినిమా తర్వాత మురుగదాస్ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. జయంత్ సినిమాకు మహేష్ ఓకే చెప్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.