జయతి గుర్తుందా?? జెమినీ మ్యూజిక్‌లో వెన్నెల అనే పోగ్రాం వచ్చేది. ఆ షోకి సోలో ఎట్రాక్షన్ జయతే! బొద్దుగా ఉండేది కానీ, ఎన్ని ముద్దు ముద్దు మాటలో. జయతికి కాల్ కలిపి.. మాటల్లో దింపాలని కుర్రకారు తెగ ప్రయత్నించేవారనుకోండి. ఇప్పుడు జయతి హీరోయిన్ అయిపోయింది. లచ్చి అనే సినిమాతో తన టాలెంట్‌ని చూపించడానికి సిద్ధమవుతోంది. అన్నట్టు ఈ సినిమాకి నిర్మాత కూడా తనేనండోయ్. సినిమా పూర్తయిపోయింది. త్వరలోనే విడుదల కాబోతోంది. లచ్చితో తన లక్ తిరుగుతుందని, ఇండ్రస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు వస్తుందని జయతి చెబుతోంది. అన్నట్టు సినిమా కోసమే ఒళ్లు తగ్గి.. కాస్త స్లిమ్‌గా మారింది.
ఈమధ్య బుల్లి తెరపై పేరు తెచ్చుకొన్న భామలు వెండితెరపై ఫోకస్ పెడుతున్నారు. అనసూయ, రేష్మీ ఈ కోవకే చెందుతారు. ఇలా వచ్చారో లేదో… అలా పాపులర్ అయిపోయారు. ఇప్పుడు జయతి కూడా ఈ ఇద్దరినే ఆదర్శంగా తీసుకొంది. క్లిక్ అయితే… పంట పండించుకోవచ్చు. ఒకవేళ అదృష్టం కలసి రాకపోయినా.. ఎలాగూ బుల్లి తెర ఉంది కదా? అని ధైర్యం వీళ్లది. మరో అనసూయో, రేష్మీనో జయతి రూపంలో దొరికితే… కుర్రకారుకి పండగే కదా?