లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఇటీవల కాలంలో రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2014 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని ప్రకటించి, తర్వాత చాలాకాలం పాటు స్తబ్దు గా ఉన్నా ఈమధ్య పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ లో పాలుపంచుకొని రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే ఇవాళ జయప్రకాశ్ నారాయణ – పవన్ మరియు ప్రత్యేక హోదా అనేద రెండు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
నిన్నజయప్రకాశ్ నారాయణ కొంత మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వంటి అంశాలపై ఈ కమిటీ నివేదిక తయారు చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ జేఎఫ్సీ నివేదిక తయారైన తర్వాత ఆ నివేదిక పై పవన్ దృష్టి సారించడం లేదని జయప్రకాశ్ నారాయణ ఆరోపించారు. మొదట్లో ఆ నివేదికపై బాగానే కసరత్తు చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత దాని మీద ఆసక్తి కోల్పోయారని జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. అలాగే ప్రత్యేక హోదా పై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి రాదని ఆయన తేల్చిచెప్పారు. అయితే అన్ని రాజకీయ పార్టీలకు ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ప్రత్యేక హోదా రాదని ప్రజలకు చెప్పకుండా ఓట్ల కోసం రాజకీయాలు నడుపుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అన్న పేరు పెట్టక పోయినా పర్వాలేదు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇస్తే చాలని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు.