శ్రీదేవి మృతి యావత్ చిత్రసీమనూ కలచి వేసింది. ప్రతి ఒక్కరూ శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. కానీ శ్రీదేవికి అత్యంత ఆప్తురాలు, స్నేహితురాలు, కలసి సినిమాల్లో పనిచేసిన నటి… జయసుధ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆమె సంతాపం ఏమిటన్నది కూడా తెలీయలేదు. శ్రీదేవి – జయసుధ ఇద్దరూ మంచి మిత్రులు. కలసి సినిమాలు చేశారు. కానీ.. శ్రీదేవి మృతి పట్ల ఆమె తన సంతాపాన్ని ప్రకటించిన దాఖాలు లేవు. జయసుధ తన భర్త మరణానంతరం మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. పైగా శ్రీదేవి అంటే ఆమెకు చాలా ఇష్టం. కాబట్టే… స్పందించలేకపోయిందని, శ్రీదేవి లేదన్న బాధ ఆమెను మరింతగా కృంగదీస్తోందని, అందుకే ఆమె మీడియా ముందుకు రాలేదని తెలుస్తోంది. కాకపోతే.. అంత ఆప్తమిత్రురాలు అయినప్పుడు కనీసం ఓ వీడియో సందేశమైనా పంపొచ్చు కదా.. అనిపిస్తుంది. ఏంటో ఈ సినిమా వాళ్లు… మరీ సెన్సిటీవ్ అయిపోతుంటారు.
శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలి
మరోవైపు శ్రీదేవి జ్ఞాపకాల్లో ఇంకా చిత్రసీమ తడిచి ముద్దవుతూనే ఉంది. ఆమెకు ప్రభుత్వం తరపునుంచి మరిన్ని పురస్కారాలు అందాలని ఆమె సన్నిహితులు, తనతో పాటు పనిచేసిన నటీనటుల ఆకాంక్ష. శ్రీదేవికి దాదా సాహెబ్ ఫాల్కే వచ్చేలా కృషి చేస్తానని మురళీమోహన్ తెలిపారు. మరో నటి శారద ‘శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి ఓ కోహినూర్ వజ్రమని, అలాంటి వాళ్లని తగిన రీతిలో సన్మాచించుకోవాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.