హైదరాబాద్: విలక్షణ వ్యాఖ్యలు చేస్తుండే అనంతపురం నాయకుడు, తెలుగుదేశం ఎంపీ జె.సి.దివాకరరెడ్డి తాజాగా తన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైనే గురిపెట్టారు. బాబుకు చాలా ఆశ ఉందని, ఆయన మహాత్మా గాంధీ అంత అవ్వాలనుకుంటున్నాడని అన్నారు. గాంధీలాగా జనంలో తన పేరు నిలబడటంకోసం పేదలకు బాగా సేవ చేయాలనుకుంటున్నాడని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ప్రజలు ఎంత చేసినా ఐదు నిమిషాలలో మరిచిపోతారని, బాబు శ్రమ వృథా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూపాయికి కిలో బియ్యం ఇవ్వటం దండగ అని, ఆ రేటును ఐదు రూపాయలకు పెంచటం మంచిదని చెప్పారు. అనంతపురం జిల్లా వాసులకు కావాల్సింది రూపాయికి కిలో బియ్యంకాదని, నికర జలాలని జేసీ అన్నారు.