చంద్రబాబు శాంతి వచనాలు చెబుతూ..సంకనాకించారని.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మాటలు ఆయన… పర్సనల్‌గా అంటూంటే.. ఎవరో రికార్డు చేసి బయట పెట్టలేదు. ఆయన నేరుగా చంద్రబాబు ఎదుటే…ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనంతపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ పార్టీ పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి.. చంద్రబాబు మారాల్సి ఉందన్నారు. జగన్ ఎలాంటివాడో తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.మావాడి సంగతి మీకు తెలియదని చెబుతున్నా .. వైఎస్‌తో నాకు సాన్నిహిత్యం ఉన్నప్పటి నుంచే జగన్ గురించి తెలుసన్నారు.
జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నాని…వైఎస్‌లో ఉన్న 10శాతం మంచిగుణాలు కూడా జగన్‌లో లేవన్నారు. అచ్చం రాజారెడ్డి లాంటి వాడు వైఎస్ జగన్ అని జేసీ స్పష్టం చేశారు. చంద్రబాబులో కూడా మార్పు రావాల్సి ఉందన్నారు. పోలీసులంతా జగన్‌కు వంగివంగి దండాలు పెడుతున్నారన్నారు. అదే సమయంలో.. జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఈ ఐదేళ్లలో రిటైర్ కారు.. మేం మళ్లీ వస్తాం, మీ పేరు గుర్తించుకుంటామని జేసీ ప్రకటించారు. గతంలో మన ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పాను.. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే మన ఎమ్మెల్యేలే 100శాతం నయమన్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు శాంతివచనాలు పక్కనబెట్టాలని సూచించారు. చప్పట్లు కొట్టే వాళ్లను పట్టించుకోవద్దన్నారు. జేసీ మాట్లాడుతున్నంత సేపు.. చంద్రబాబు… కామ్‌గా వింటూనే ఉన్నారు. నిజానికి.. జేసీలా.. నిజాలు చెప్పే నేతలు లేకపోవడం వల్లే చంద్రబాబుకు అసలు విషయాలు తెలియడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.