గత రెండు రోజులుగా జె. సి. దివాకర్ రెడ్డి అధిష్టానంపై అలగడం అధిష్టానం వైపు నుంచి కాస్త బుజ్జగింపులు రావడం రాజీనామా చేస్తానని ప్రకటించడం ఇవన్నీ తెలిసిందే. ఎట్టకేలకు అనంతపురంలో రహదారుల విస్తరణ కు 45 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో అలక వీడిన జెసి దివాకర్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో ఆయన వివరణ కోసం పలు చానళ్లు ప్రయత్నించగా వాటిలో ఆంధ్రజ్యోతి ఛానల్ పై ఆయన స్పందించిన తీరు షాక్ కి గురిచేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జెసి వివరణ కోసం ఒక రిపోర్టర్ ప్రయత్నిస్తుండగా కోపోద్రిక్తుడైన జేసీ దివాకర్ రెడ్డి అసలు నువ్వు ఏ ఛానల్ నుంచి వచ్చావు అని రిపోర్టర్ ను ప్రశ్నించడం దానికి ఆ రిపోర్టర్ సమాధానమిస్తూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అని చెప్పడం దీంతో మరింతగా కోపం తెచ్చుకున్న “ పనికిమాలిన **** “ అంటూ బూతులు లంకించుకోవడం జరిగింది. ఆ తర్వాత “ప్లీజ్ గెటవుట్, ప్లీజ్ గెటవుట్” అంటూ ఆ రిపోర్టర్ ను బయటకు పంపించి వేశాడు జె. సి. దివాకర్ రెడ్డి.
ఆంధ్రజ్యోతి ఛానల్ తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలమైన ఛానల్‌గా పేరుపడింది జెసి దివాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ. అయినప్పటికీ జేసి ఆంధ్రజ్యోతిపై ఆ రేంజులో విరుచుకు పడటానికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది.