జేసీ బ్రదర్స్ అంటే… సూటిగా సుత్తి లేకుండా.. మనసులో ఏది ఉంటే అది చెబుతారనే పేరు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అంటే నడిచిపోతుంది కానీ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అదీ కూడా.. తాము.. మొత్తంగా… ఓడిపోయినప్పుడు.. కూడా అలాగే మాట్లాడితే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి.. మాట్లాడి.. పోలీసుల ఆగ్రహాన్ని చూస్తున్నారు. చంద్రబాబు అనంతపురం పర్యటనలో.. పోలీసుల తీరుపై… జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల బూట్లు నాకుతున్నారంటూ.. అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. దానిపై.. పోలీసు అధికారుల సంఘం ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఖండించింది. జేసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
నిజానికి పోలీసులు గతంలో… జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్లే… గోరంట్ల మాధవ్ అనే ఓ రాజకీయనాయకుడు పోలీసుల నుంచి పుట్టకొచ్చారు. తాడిపత్రిలో ఉన్న ఓ బాబా ఆశ్రమం గొడవలో… పోలీసుల తీరుపై… జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు.. టీడీపీనే అధికారంలో ఉంది. ఎంపీగా జేసీ.. ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు ఉన్నారు. అప్పుడు అలా అన్నప్పటికీ.. పోలీసు అధికారుల సంఘం నేతగా ఉన్న సీఐ గోరంట్ల మాధవ్.. రెచ్చిపోయారు. జేసీపై మీసం మెలేసి తొడకొట్టారు. అది జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చింది. వెంటనే.. ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అది పోలీసు అధికారుల సంఘ నేతలకు మరింత ఊపునిచ్చినట్లుగా ఉంది. పదే పదే రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం జేసీపై.. పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడుతోంది. వారికి మద్దతుగా వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. పోలీసులు మంచి వాళ్లని.. సర్టిఫికెట్ ఇస్తూ.. జేసీపై ఎదురుదాడికి దిగుతున్నారు. గోరంట్ల మాధవ్… బూట్ల నాకబోమని.. బుల్లెట్లు వాడతామని.. జేసీకి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అయితే.. గన్‌మెన్ లేకుండా బయటకు రావాలని… జేసీ బ్రదర్స్‌కు సవాల్ చేశారు. జేసీ బ్రదర్స్ వర్సెస్ పోలీసులు, వైసీపీ నేతలనే వివాదం.. ఎక్కడి వరకు వెళ్తుందో మరి..!